breaking news
-
బీఆర్ఎస్ కక్కుర్తితో రాష్ట్రానికి శాశ్వత నష్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అవాస్తవిక ప్రచారం చేపడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రచారానికి అంశాలవారీగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పింది మీరే. 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తవగా 2023–24 వరకు మొత్తంగా 162 టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలు. ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇచ్చావో చెప్పు?’అని హరీశ్‌రావును మంత్రి ఉత్తమ్ ఆ ప్రకటనలో నిలదీశారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్‌హౌస్ నీటమునిగిందని.. అదే ఏడాది కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్ ట్రెస్ట్వాల్ కూలి పంప్‌హౌస్‌లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయని ఆయన గుర్తుచేశారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని పేర్కొన్నారు. నిధుల మళ్లింపు కోసమే బీఆర్ఎస్ బ్యారేజీలు.. ‘ఫరక్కా బ్యారేజీ కట్టింది నీటి మళ్లింపు కోసమే. రాతి పునాది వల్లే ఆ బ్యారేజీ మనుగడ సాగిస్తోంది. ఫరక్కా బ్యారేజీని 1975లో కట్టినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ప్రతిపాదించింది.. కట్టింది.. బీఆర్ఎస్ హయాంలోనే. మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం కడితే కాళేశ్వరం బ్యారేజీలను నిధుల మళ్లింపు కోసం కట్టారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యం’అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కడతామని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఏనుగులతో ర్యాలీలు తీయలేదా? ఆ తర్వాత బ్యారేజీ కట్టకుండా ఎందుకు పక్కనపెట్టారు? తుమ్మిడిహెట్టి వద్ద కడితే పేరు కాంగ్రెస్‌కు, పైసలు రావనేది ప్రధాన కారణం. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కి.మీ. ఓపెన్ కెనాల్ నిర్మాణం జరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే 100 కి.మీ. దాకా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవి. కానీ మేడిగడ్డ బ్యారేజీ వల్ల 100 కి.మీ. కిందకు వెళ్లి నీటిని ఎత్తిపోయడం, వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేయడం చేశారు. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు.. తిప్పిపోతల పథకం’అని ఉత్తమ్ మండిపడ్డారు.వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్‌రావే కాళేశ్వరం బ్యారేజీ వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్‌రావేనని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. 2018 దాకా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నాసిరకం పనులు చేపట్టి, ప్రజాధనం దురి్వనియోగం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదని... నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావొద్దనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ రూ. 38 వేల కోట్లతో పూర్తై ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదన్నారు.కానీ బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల రాష్ట్రానికి, రైతాంగానికి శాశ్వత నష్టం జరిగిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తి వల్ల తెలంగాణ ప్రజలు నీటిపారుదల ప్రాజెక్టుల అప్పులకు ఏటా రూ. 16 వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరంలో అన్ని మోటార్లు పనిచేసి ఉంటే విద్యుత్ భారమే ఏడాదికి రూ. 10 వేల కోట్లు అయ్యేదన్న మంత్రి ఉత్తమ్.. ఒకవేళ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ భారం కేవలం రూ.1000 కోట్లే అయ్యేదన్నారు. బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణకు ఆర్థిక భారం శాశ్వతంగా నిలిచిపోయిందని విమర్శించారు. -
పాలమూరు ఎవరికి వారు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు పోట్ల గిత్తల్లా తలపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కుదురుకోలేక కొందరు, ఇతర పార్టీల నేత లను ప్రోత్సహిస్తూ మరికొందరు, పార్టీలోని వారితో కలిమి లేక ఇంకొందరు, గొంతెమ్మ కోర్కెలతో ఇంకా కొందరు ఎవరికి వారే వివాదాస్పదమవుతున్నారు. ఈ గ్రూపు గొడవలు, గట్టు పంచాయతీలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో బట్టబయలు కావడం.. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేసుకోవడం.. ఆమె ముందే వాదులాడుకోవడంలాంటి ఘటనలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని సతమతం చేస్తున్నాయి. గద్వాల నుంచి ఆలంపూర్ వరకు, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు వివాదాలకు కారణమవుతూ వీలున్నంత మేర పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు పోటీలు పడుతుండటం గమనార్హం. చాప కింద నీరులా.. చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగ కొట్లాటలకు దిగుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఏకంగా రాష్ట్రంలోని ఓ కీలక మంత్రితో పంచాయతీకి దిగారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే కొందరు ఎమ్మె ల్యేలు డిన్నర్ భేటీ అయ్యారన్న వార్త రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, టీకప్పులో తుపానులా ఆ వివాదం ముగిసినా, గద్వాల రాజకీయం గట్టు దాటింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఓ ఎంపీ ఘర్షణకు దిగారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. అక్కడి ఎమ్మెల్యేకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సఖ్యత కుదర్చడం రాష్ట్ర పార్టీకి కూడా సాధ్యం కావడం లేదు. ఇద్దరూ పట్టిన పట్టు వీడకుండా పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నిత్యకృత్యమైందనే చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ మొదలు పార్టీ పదవుల వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విభేదాలు లేకపోయినా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్, స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందనే చర్చ ఉంది. మక్తల్ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారని, ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ పోస్టర్లు కూడా వేశారని తెలుస్తోంది. అవిగో నష్టాలు... ఇవిగో ఆధారాలు నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ సెగ కాంగ్రెస్‌ను గట్టిగానే తాకుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం ఆ నియోజకవర్గంలో తీవ్ర విభేదాలకు దారితీస్తోంది. దీనికి తోడు తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లురవి సత్కరించడం దుమారానికి దారి తీసింది. ఈ విషయమై ఆలంపూర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు కలిపి 26 మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి కలిసి అటు ఆలంపూర్‌లోనూ, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పార్టీకి నష్టం చేస్తున్నారని సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు చెందిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించి 10 శాతం కమీషన్ తీసుకున్నారంటూ మల్లురవిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక, కాంగ్రెస్ కేడర్ అడుగుతున్న విధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట ప్రాజెక్టును కాకుండా బీఆర్ఎస్ నేతల మాటలు విని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన మల్లురవి మీదనే కాంగ్రెస్ ఇంచార్జికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం గాం«దీభవన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మంత్రులకు... మేం తక్కువా? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఓ విచిత్ర డిమాండ్‌ను తెరపైకి తెస్తూ మంత్రివర్గాన్నే సవాల్ చేస్తున్నారు. మంత్రులకంటే తామేం తక్కువ కాదని, మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులిస్తారో అన్ని నిధులు తమ నియోజకవర్గాలకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు దఫాలుగా వారు మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు. మంత్రులతో సమానంగా నిధులివ్వాలని అడిగినట్లు స్వయంగా వారు మీడియాకు వెల్లడించడం గమనార్హం. గాంధీభవన్‌లో జరిగిన లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలోనూ వారు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అదేవిధంగా పాలమూరు లోక్‌సభ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ వారు కొత్త రాగాన్ని అందుకోవడం గమనార్హం. ఈవిధంగా సొంత పార్టీ నేతలతో, ఇతర పార్టీల నాయకులతో, మంత్రులతో, అధికారులతో పంచాయతీలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ రాజకీయం ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే! -
అబద్ధాలను పటాపంచలు చేస్తాం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో బీఆర్ఎస్కు మంచిపేరు రావడంతోపాటు లబ్ధి జరుగుతుందనే దురుద్దేశంతో నాడు ప్రతిపక్షంలో, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బురద జల్లుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నిజమని నిరూపించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం. తెలంగాణ జీవధార. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణకు కల్పతరువు. అలాంటి ప్రాజెక్టును రీఇంజనీరింగ్‌ను చేయడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు నిజాలు వివరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందుకు వెళ్లి నిజాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను పటాపంచలు చేస్తాం. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ నాయకత్వం బెదరదు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి సాగునీటిని అందించాలి. లేనిపక్షంలో ప్రజాఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం’అని హరీశ్‌రావు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం–వాస్తవాలు అనే అంశంపై హరీశ్‌రావు సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సహా పార్టీ ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో సుమారు గంటన్నరపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. సీఎం, మంత్రులది దుష్ప్రచారం.. ‘మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాళేశ్వరం కుప్పకూలిందంటూ దుష్ప్రచారం చేస్తున్న వారు ఈ ప్రాజెక్టు అనేక రిజర్వాయర్లు, బ్యారేజీలు, కాలువలు, పంప్‌హౌస్‌ల సమాహారమని గుర్తించాలి. కానీ ఈ అంశాన్ని విస్మరించి ప్రాజెక్టు వ్యయం పెంపు, ఆయకట్టు మొదలుకొని అనేక విషయాలపట్ల సీఎం, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతోంది. రాష్ట్ర అవతరణకు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు చెప్పినా ఒక్క అనుమతి సాధించలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 2,328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది. పనులు చేపట్టకుండానే అంచనాలను రూ. 17,875 కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచింది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించకపోవడం, నీటి లభ్యత కేవలం 44 టీఎంసీలు ఉండటం, పర్యావరణ, అటవీ అనుమతులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై ఆలోచన చేశాం’అని హరీశ్‌రావు వివరించారు. తుమ్మడిహెట్టి వద్ద ప్రయత్నాలు విఫలమైనందునే.. ‘తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు మహారాష్ట్రలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు విఫలమయ్యాయి. తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచన మేరకు మేడిగడ్డను ఎంపిక చేశాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ప్రాజెక్టును విస్తరించడం వల్లే అంచనా వ్యయం పెరిగింది. దేశంలో అతితక్కువ అంచనా వ్యయం పెంపుతో, అతితక్కువ సమయంలో నిర్మితమైన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే. పోలవరం ప్రాజెక్టు కుప్పకూలినా ఎన్నడూ సందర్శించని ఎన్డీఎస్ఏ.. ఇప్పుడు ఈడీ, సీబీఐ తరహాలో కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలా వ్యవహరిస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేసిన గంధమల్లకు నీరు ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. నిందలు, దందాలు, చందాల నినాదంతో రేవంత్ పాలన: కేటీఆర్ ‘తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలకు పాతరేసిన సీఎం రేవంత్ దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నాడు. బీఆర్ఎస్పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు అనే నినాదంతో పాలన సాగిస్తున్నాడు. గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, సీతారామ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారు. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా సీఎం, మంత్రులు, బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రాజక్టులు, బ్రిడ్జీలు కూలినా స్పందించని ఎన్డీఎస్ఏ.. కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్లలో కేవలం ఒక్కచోట రెండు పిల్లర్లు కుంగితే ఏడాదిన్నరగా మరమ్మత్తు చేయకుండా రాద్ధాంతం చేస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట బీజేపీ ఆఫీసులో ఎన్డీఏ రిపోర్ట్ తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నివేదిక చెత్తబుట్టలో వేయడానికి తప్ప దేనికీ పనికి రాదని ఎల్ అండ్ టీ సంస్థ తేల్చిచెప్పింది. పార్లమెంటు నూతన భవనం, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది కూడా ఎల్ అండ్ టీ సంస్థే. కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తెలంగాణ రైతుల గొంతు నొక్కే కుట్ర చేస్తున్న నేపథ్యంలో జిల్లాకు కూడా వెళ్లి వాస్తవాలు చెప్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఈటల అసత్యాలే చెప్పారు.. మంత్రి తుమ్మల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వాగ్మూలం అసత్యమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్‌కు ఈటల అసత్యాలు చెప్పారు. శనివారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఈటల ప్రస్తావించిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని.. మేడిగడ్డకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిటీ వేశారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు, సబ్ కమిటీకి సంబంధం లేదని తుమ్మల స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే సబ్ కమిటీ వేశారు. నేనే సుమోటోగా కమిషనర్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నా. సబ్ కమిటీ నిర్ణయాలను కమిషన్ ముందు ఉంచుతా’’ అని తుమ్మల తెలిపారు.‘‘చాలా రోజులు అయింది కాబట్టి అనాలోచితంగా ఇచ్చారో తెలీదు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని, పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణం కోసం ఏర్పాటు కోసం వేసిన సబ్ కమిటీ కాదు. మేడిగడ్డ, ప్రాణహిత, కడ్కో పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ లేదు.. రిపోర్ట్ ఇవ్వలేదు. సబ్ కమిటీకి.. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం పొందినట్లు ఈటల రాజేందర్ చెప్పారు.. అది వాస్తవం కాదు. కేబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ రాలేదు. కేబినెట్ ఆమోదానికి కాళేశ్వరం ఏ రోజూ రాలేదు’’ అని తుమ్మల పేర్కొన్నారు.ఈటలకు తప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. 43 ఏళ్లుగా పద్ధతితో, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నాను. నా వ్యక్తిత్వం ఈటల రాజేందర్‌కు తెలుసు. ఈటల రాజేందర్ స్టేట్మెంట్ చూశాక కొంత బాధేసింది. ఈటల రాజేందర్ ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందో తెలీదు. సబ్ కమిటీ రిపోర్ట్‌ను కమిషన్‌కు ఇస్తాను. నాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదు. ఈటల రాజేందర్ వాంగ్మూలం చాలా బాధాకరం’’ అని తుమ్మల వ్యాఖ్యానించారు. -
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్‌పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్‌లో తెలిపారు. -
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్లో ఎస్సీ, బీసీ, ఓసీలకు అవకాశం ఇవ్వనుంది. ఓసి నుంచి సుదర్శన్ రెడ్డి ,బీసీ నుంచి వాకిటి శ్రీహరి ,ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్‌లకు మంత్రి వర్గంలోకి తీసుకోనుండగా.. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనుందనే చర్చ జరిగింది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’
సాక్షి, తెలంగాణభవన్: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచర్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామన్ డైలాగ్ చెబుతున్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటే రెండు పిల్లర్సే కూలాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. కానీ, బనకచర్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం లేదు. తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా హరీష్ రావు అద్భుతంగా పనిచేశారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు గారిది. తెలంగాణ తెచ్చుకున్న నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన. సుంకిశాల, slbc టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. టన్నెల్ కూలిపోయి కూలీలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.చిన్న పిల్లర్ మెడిగడ్డలో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. గుజరాత్లో బ్రిడ్జ్ కూలి 140 మంది చనిపోతే.. ఏ రిపోర్ట్ ఉండదు.. బాధ్యులపై చర్యలు ఉండవు. బీహార్‌లో రోజుకో బ్రిడ్జి కూలిపోతే ఏ రిపోర్ట్ ఉండదు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. Ndsa రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారైంది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ కమీషన్‌తో కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మించారు. L and T సంస్థ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది. అదే సంస్థ మేడిగడ్డ బ్యారేజినీ నిర్మించింది. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు అని అన్నారు. -
ఎప్పుడేం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ లోపల, వెలుపల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు విచారణ సంస్థల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో విచారణ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కేడర్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్‌కు చేరుకోనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీటన్నింటిపై ఎలా స్పందిస్తారనే చర్చ నడుస్తోంది.కేసీఆర్ విచారణ నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఏమిటో?కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ ఎదుట విచారణకు ఈ నెల 9న హరీశ్‌రావు, 11న కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయంలో కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ ఇప్పటివరకు స్పందించక పోవడాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ చేపట్టే కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలపడం తెలిసిందే. ఈ నెల 11న కూడా తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.‘ఫార్ములా–ఈ’పై విచారణకు కేటీఆర్‘ఫార్ములా–ఈ’ కారు రేసు అంశంలో గతంలో విచారణకు హాజరైన కేటీఆర్‌కు ఈ నెల 5న రావాల్సిందిగా ఏసీబీ మరోసారి నోటీసు జారీ చేయగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక హాజరవుతానని పేర్కొనడం తెలిసిందే. శనివారం హైదరాబాద్ చేరుకోనున్న కేటీఆర్ ఈ నెల 3వ వారంలో ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్, మరో కీలక నేత హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే సమయంలోనే కేటీఆర్‌కు కూడా నోటీసులు రావడం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.‘కవిత ఎపిసోడ్’పైనా పార్టీలో ఉత్కంఠఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం కలకలం సృష్టించింది. గత నెల 23న అమెరికా నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌కు తాను లేఖ రాసిన విషయాన్ని అంగీకరిస్తూనే ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అలాగే గత నెల 29న కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ జెండా, కండువాలు లేకుండా ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ కేడర్‌లో వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్ తాజా పరిణామాల జోలికి వెళ్లకుండా కేవలం సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వంటి అంశాలపైనే దృష్టి సారించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. -
ఒక నోటీస్‌కే ఆగమాగం.. జైల్లో ఉన్న నాకేం అనిపించాలి?: సీఎం రేవంత్
యాదాద్రి భువనగిరి జిల్లా: బీఆర్ఎస్పై మరోసారి ద్వజమెత్తారు సీఎం రేవంత్‌రెడ్డి,. బీఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అంటూ విమర్శించారు. తమ పార్టీ బీఆర్ఎస్లో దెయ్యాలు చేరినయి అని సొంతింటి బిడ్డనే అంటోందని సీఎం రేవంత్ ఇక్కడ ఉదహరించారు. జిల్లాలోని తుర్కపల్లి మండలం తిర్మలాపూర్ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లలో మొదటి తారీఖే జీతాలు పడ్డాయా అని ఉద్యోగుల కుటుంబాలని అడుగుతున్నా. ఇన్ స్టాల్ మెంట్లలో జీతాలు ఇచ్చినోడు నన్ను ప్రశ్నిస్తాడా?, బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణగా మార్చినోళ్లు నన్ను విమర్శిస్తారా?,కల్వకుంట పాలన చేసినోళ్ల కల్వకుంట్ల కుటుంబమోళ్లు. వాసాలమర్రిలో ఆకుల ఆదవ్వకు అల్లనేరేడు పళ్లు ఇచ్చాడు. ఆమె ఆస్పత్రిలో పడింది. వాసాలమర్రిని స్మశానంగా మార్చాడుపనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందన్నట్లు వాసాలమర్రిని కేసీఆర్ అలా చేశాడు. యాదగిరి గుట్టను యాదాద్రి గా మార్చారు. దాన్ని తిరిగి యాదగిరిగుట్టగా మార్చాం. టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజ్, విద్యా సంస్థలను యూనివర్సిటీగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాం. తాటిచెట్టు అంత ఎదిగి మోకాళ్లలో మెదడు ఉన్న ఒకాయన గంధమల్ల రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నాడు. రెండు లక్షల కోట్లు ఇరిగేషన్ కోసం కేటాయింస్తే నల్లగొండలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదు. ఎవరు అడ్డం వచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తాంగుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా ప్రక్షాళన చేసుకున్నారు. కానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?,మూసీ మురికిలోనే మేం చావాలో బీజేపీ నేతలు చెప్పాలి. పుట్టబోయే బిడ్డలు కాళ్లు, కన్నులు వంకరపోతే బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా?, మేం మీ ఎర్రవెల్లి, జన్వాడ ఫాంహౌస్‌ను గుంజుకుంటామని అనలేదు కదా?, మూసీ కట్టొద్దనే, ప్రక్షాళన చేయద్దనే ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయి. పదేళ్లలో ఎస్సెల్బీసీ, గంధమల్ల, పిల్లాయిపల్లిని ఎందుకు పూర్తిచేయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఎందుకు నిర్మించలేదు’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఒక్క నోటీస్ ఇస్తేనే ఆగమాగం అవుతుండని, నెలల తరబడి జైల్లో ఉన్న తనకు ఇంకేం అనిపించాలని రేవంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
మెజార్టీ ఎమ్మెల్యేల తీరు బాగాలేదు: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తమ పని తీరును బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమస్వయం చేసుకోవాల్సి న అవసరం ఉందన్నారు మహేష్ గౌడ్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు..సరిద్దిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలి. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మేల్యేలు కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.‘పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి..పార్టీ బలోపేతం పై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారంలో ఉన్నపుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి. పార్టీ సమర్ధవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ స్థాయి బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిశక్తి వంచన లేకుండా ప్రభుత్వం పని చేస్తోంది. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. కార్యకర్తలు నిరాశగా ఉన్నారు..వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఉద్యోగాలు, విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదు జూన్ మాసంలో పిసిసి కార్యవర్గం, మంత్రి వర్గ విస్తరణ పూర్తి అయ్యే అవకాశం ఉంది. శాస్ర్తీయ బద్దంగా కుల సర్వే, బిసిలకు 42 శాతం రిజ్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది’ అని స్పష్టం చేశారు. -
బాబుకు సీఎం రేవంత్ రెడ్డి దాసోహం: హరీష్ రావు ఫైర్
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దాసోహమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన క్యాబినెట్ సమావేశం వలన ఎటువంటి ప్రయోజనం లేకపోగా, తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిగా మరచిపోయిందని, రాష్టంలోని కాంగ్రెస్ నేతలు గాలి మోటార్‌పై తిరుగుతూ, గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. తాము ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారని, అది తీవ్ర నిరాశనే మిగిల్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని, దీనిపై క్యాబినెట్లో ఐదు గంటలపాటు చర్చించడం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను నిట్ట నిలువునా ముంచుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి, గ్రామాభివృద్ధికి పాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో సీఎం రెవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడిన అబద్ధమేనని, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్‌లు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని హరీష్ రావు ఆరోపించారు.రైతులను దెబ్బతీసేలా క్రాఫ్ హాలీడేను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నీతి అయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు నిలదీశారు. అలాగే చంద్రబాబు ఎదురించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్లనున్నదని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. శ్రీశైలం రైడింగ్ పాజెక్టు పనులు నిలిపివేయాలని కోరారు. కాళేశ్వరం కుప్ప కూలిందని చెబుతున్న సీఎం రెవంత్ రెడ్డి గంగమళ్లకు నీటిని ఎక్కడి నుంచి తెస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల -
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది....తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది. అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను... మా బతుకు నిబద్ధతో ఉంది. నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్ట్ రీ డిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో మేం(హరీష్, తుమ్మల పేర్లు) ఉన్నాం. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు.మూడు బ్యారేజీల వ్యయం రూ. 10వేల కోట్ల లూపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్...ఆయనే బాస్. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారు ’’ అని ఈటల మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.ఇదీ చదవండి: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు -
లుకలుకలు.. కుమ్ములాటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు. ఒకటి అధికార కాంగ్రెస్, రెండోది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తుంటాయి. కానీ ప్రస్తుతం.. ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ వేటికవే తమతమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కని్పస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే, బీజేపీ, బీఆర్ఎస్లలో మాత్రం విభేదాలు బహిరంగమవుతుండటం మరో విశేషం. కాంగ్రెస్‌లో పదవులు, ప్రాధాన్యం రభస రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ.. పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహారశైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నర తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్‌లో చర్చలు జరిగినా తేలడం లేదు. అదిగో విస్తరణ...ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చిన ఇద్దరు ఆశావహ ఎమ్మెల్యేలు.. కేబినెట్లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గళం విని్పంచినట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలా కాలం తర్వాత నియమించిన కమిటీల్లో కొంత సామాజిక న్యాయ కోణం కనిపించినా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూనియర్లకు, ప్యారాచూట్ల (బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి)కు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు గాం«దీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, టీ కప్పులో తుపాను మాదిరి ఆ వివాదం ముగిసినా, పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది. మంత్రులపై ఫిర్యాదులు..పాలనపై విమర్శలు సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ జరుగుతోంది. ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెబుతుంటే, తాము చేసినవన్నీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గులాబీకి ‘కుటుంబ ముళ్ల’ పోటు బీఆర్ఎస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో ఆమె ఇప్పుడు రె‘బెల్స్’ మోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్‌ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వరంగల్‌లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైన ఆమె, ఆ తర్వాత గేర్ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్‌కు స్వదస్తూరితో రాసిన లేఖ బీఆర్ఎస్లో అశాంతిని బహిర్గతం చేసింది. ఆ లేఖ లీక్ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్ఎస్నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. కేసీఆర్ దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత ఆమె స్పీడ్ మరింత పెంచారు. ఇష్టాగోష్టిలో బాంబు పేల్చిన కవిత మీడియాతో ఇష్టాగోష్టి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్ఎస్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటున్నందుకే తనను బయటకు పంపాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెపుతున్న ఆమె, పరోక్షంగా పార్టీని సవాల్ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో.. బీఆర్ఎస్ చేయలేని పనిని తాను చేస్తున్నానని పార్టీ కేడర్‌కు సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ కుటుంబ పంచాయతీ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. ఇలావుండగా.. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీశ్‌రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడం కూడా అటు బీఆర్ఎస్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్ మాత్రం మౌన ముద్రలోనే ఉండడం గమనార్హం. కమలం.. కలహాల కాపురం సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలైనా లోలోపలే పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరూ ఒక్కచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్టు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్‌రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజాసింగ్ టార్గెట్ ఎవరో? రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ స్టైల్ మార్చారు. ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనయినా విలీనం చేసుకుంటారు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం వెళ్లింది. అయితే ఆ అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో.. అధిష్టానం పట్టీపట్టనట్టుగా ఉండటం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. ఈ విధంగా.. ఎన్నికలకు మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ మూడు ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
గాంధీ భవన్‌కు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌కు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్యలకు దిగినట్లు.. అందుకు కేబినెట్ విస్తరణే కారణమన్నట్లు సమాచారం. ఆశించిన వారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. -
ఎవరితోనూ పొత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే మనుగడ సాగిస్తూ.. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది. వంద అసెంబ్లీ సీట్లతో గులాబీ జెండా ఎగురుతుంది’అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొ న్న అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు. ‘బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపం కాబోతున్నా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటం లేదు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తాం. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా, గురువు చంద్రబాబుకు దాసోహం అయిన సీఎం ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా, ఢిల్లీలో ధర్నా చేసినా కలసి వచ్చేందుకు సిద్ధం, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఏదైనా చేస్తాం’అని హరీశ్ అన్నారు. ఆ ఫుటేజీ బయట పెట్టాలి..‘సీఎంకు దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయట పెట్టి, వారిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణకు తలవంపులు తెచ్చారు’అని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో ఆదాయం నేలచూపులు..‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేసే వాళ్లు దివానా గాళ్లు. ఆరు గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చి, తాను తీసుకున్న గోతిలో రేవంత్ తానే పడిపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ద్రోహి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్‌కు లేదు’అని హరీశ్ విమర్శించారు.దుర్మార్గుల చేతుల్లోకి తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి గందర గోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు కలిచివేశాయని, ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ప్రసంగించారు. మధుసూదనాచారి, హరీశ్‌రావు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తర్వాత జాతీయ పతాకాన్ని మధుసూదనాచారి ఆవిష్కరించారు. -
నోటీస్ కాదు.. నన్ను సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాపుకు రాజాసింగ్ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్‌కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి’ అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. రాజాసింగ్ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్‌కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్‌తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్‌తో రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కిషన్‌రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?‘టైమ్ పాస్ మీటింగ్‌లతో అలసిపోయాం’ -
‘తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఆయనే’
హైదరాబాద్: తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల రాజేందరేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ను వదిలి పెట్టిన అంటున్న ఆయన.. 24 గంటలు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న విషయం ఆ పార్టీ నాయకులే గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. ‘ లెఫ్ట్ వింగ్ లో ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవికోసం రైట్ వింగ్ లోకి పోయాడు.. ఏ పదవి రావట్లేదని మా నాయకులపై ప్రస్టేషన్‌తో ఈటెల రాజేందర్ మాట్లాడొద్దు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి..రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ ,కార్పొరేషన్ చైర్మన్ లు నన్ను ఇబ్బంది పెట్టారని ఇంగ్లాండ్ మిస్ మ్యాగీ అంటుంది అని హరీష్ రావు అంటుంన్నాడు..మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి. ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో అలా మాట్లాడించారేమో బీఆర్ఎస్ వాళ్లు. నిన్న కౌంటర్‌గా కేసులు కూడా పెట్టారు. నిన్న కౌంటర్ గా కేసులు కూడా పెట్టారు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని పదేండ్లు అనుభవించారు..అధికారుల లిస్ట్ రెడ్ బుక్‌లో నమోదు చేస్తా అనడం విడ్డూరంగా ఉంది. అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనే విషయంలో హరీష్ రావు రోల్ మోడల్. రేవంత్ రెడ్డి ఎక్కడనైనా ఉండి సమీక్ష చేస్తడు...ములుగు అడవుల్లోనైన సమీక్ష చేస్తడు. మీరు ప్రగతి భవన్ అని ప్రగతి లేని బిల్డింగ్ కడితే మేము అధికారంలోకి రాగానే గడీలు పగలగొట్టాం’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. -
మిల్లా మాగిపై అసభ్య ప్రవర్తన ఆ ముగ్గురి పనేనా? ఇంతకీ ఎవరా ముగ్గురు?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిస్‌వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై హరీష్ రావు తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై హరీష్ రావు స్పందిస్తూ.. అందాల పోటీలు నిర్వహించడం రాక కాంగ్రెస్ నేతలు తెలంగాణ పరువు తీశారని అన్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఎంపీ, కార్పొరేషన్ ఛైర్మన్, ఐఏఎస్ అధికారి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పట్ల అసభ్యకరంగా,అభ్యంతరకరంగా ప్రవర్తించారని వార్తలొస్తున్నాయని అన్నారు. ఆ ముగ్గురు కారణంగా మిస్ ఇంగ్లండ్ అందాల పోటీల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. రేవంత్‌కు చిత్త శుద్ది ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజీ భయటపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. -
‘తెలంగాణలో ఏపీ తరహా వ్యూహం.. బీజేపీ వదిలిన బాణమే కవిత’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదంటూ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. బంగారు బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ జాగృతిలో 800 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘బీజేపీ వదిలిన బాణమే కవిత. ఒక మహిళగా రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీలో కూడా ఆమె కుంభకోణం చేశారు. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే కొత్త డ్రామాకు తెర లేపారు. తెలంగాణ జాగృతిలో భారీ స్కాం జరిగింది. జాగృతిపై విచారణ జరపాలి. రాజీవ్ ప్రతాప్ రుడి పదవి పోవడానికి జాగృతి సంస్థ కారణం. జాగృతి సంస్థ అవినీతిలో కూరుకుపోయింది.తెలంగాణలో చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని కార్పొరేట్ సంస్థల దగ్గర జాగృతి డబ్బులు వసూలు చేసింది. జాగృతి దోపిడీకి అన్ని కార్పోరేట్ సంస్థలు బలయ్యాయి. కవిత మాఫియా డాన్. ఆమె చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదు. కవిత ఏ వ్యాపారం చేసిందని జూబ్లీహిల్స్‌లో రెండు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తుంది. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ పొందాలనుకుంటుంది.. అందుకే కవితను రంగంలోకి దింపింది. లిక్కర్ కేసు నుండి బయటపడటం కోసం కవిత బీజేపీకి పనిచేస్తోంది.అవినీతి సొమ్ము దాచుకోవడానికే జాగృతి బలోపేతం అంటుంది. బీసీలకు న్యాయం చేస్తా అన్న కవిత.. జాగృతికి ఎందుకు అధ్యక్షురాలిగా ఉంది. జాగృతి అధ్యక్షురాలిగా బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేసింది జయశంకర్.. కేసీఆర్ కాదు. ముఖ్యమంత్రి పదవి కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చేరాడు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోపిడిలో ఏంతో మంది బలయ్యారు. ఎంపీ సంతోష్ ఇప్పుడు ఎందుకు చెట్లు నాటడం లేదు.. పదేళ్లు చెట్ల పేరుతో సంతోష్ కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కేటీఆర్‌కు అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయి. వాటి లెక్కలు చూసుకోవడానికే కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. ఏపీ తరహా వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ తిట్టుకున్నాయి.. ఎన్నికల నాటికి రెండు కలసి పోటీ చేశాయి. తెలంగాణలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
‘అమరవీరుల మీద ఒట్టు.. తెలంగాణను అభివృద్ధి చేస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. నాడు రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నారు.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం. తెలంగాణను 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. ఇది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాపం కాదా!. తెలంగాణకు పట్టిన శని బీఆర్ఎస్, కాంగ్రెస్. దోపిడీ, దగా, మోసం చేయడంలో దొందుదొందే. తెలంగాణను దోచుకుంటున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్.తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరముంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ను పాతర వేయాల్సిందే. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ నినాదానికి కట్టుబడిన పార్టీ బీజేపీ. తెలంగాణ ఉద్యమానికి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేసింది. 11 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.బంగారు తెలంగాణ ఎక్కడ?. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అన్నారు. ఆయన కుటుంబం మాత్రం అయ్యింది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా దోచుకున్నారు. నాడు దెయ్యం.. నేడు దేవత అయ్యిందా?. నాడు రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు. సకల జనుల సమ్మె పేరుతో ఉద్యమించిన వారి మీద, అమరవీరుల మీద ఒట్టేసి చెబుతున్నాను. తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని హామీ ఇచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణకు సపోర్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ బిడ్డలారా చనిపోకండి మీకు అండగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. ఇంకా రాజకీయం చేయొద్దు పిల్లలు చనిపోతున్నారు బిల్లు పెట్టండి అని చెప్పింది బీజేపీనే. ఈ నీళ్ళు, నిధులు, నియామకాల కోసం యువకులు పోరాటం చేశారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో తిరోగమన దిశలో తెలంగాణ పోతుంది. తెలంగాణ తన గొప్పదనం చాటి చెప్పాలంటే బీజేపీతోనే సాధ్యం’ అని అన్నారు. -
అమరుల త్యాగాలను మనం గుర్తుచేసుకోవాలి: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటం, రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ అమరవీరులకు కనీసం నివాళులు కూడా అర్పించడం లేదని మండిపడ్డారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘జాగృతి కొత్త కార్యాలయంలో మొదటి సారి జెండా ఎగురవేసినం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారు. అది మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమ తో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు. అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం నివాళులు కూడా అర్పించడం లేదు. అమరవీరులకు నివాళులు అర్పించే వరకు మా జాగృతి పోరాటం చేస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి
కవాడిగూడ (హైదరా బాద్): కేంద్ర ప్రభు త్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవా లని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025ని వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా, భారీ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఎంఐఎం శాసన సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, పర్సనల్‌లా బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ మత పెద్దలు ఈ ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.దీనికి ఎంఐఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అదే విధంగా ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. పర్సనల్‌లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ముస్లింల వ్యక్తిగత హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడు ఓ కుటుంబ డ్రామా నడుస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు దండుకున్న సొమ్మును పంచుకోవడంలో తలెత్తిన గొడవలే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు చేసి దోచుకున్న ఆస్తుల కోసం జరుగుతున్న గొడవల్లో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచి్చన ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మచ్చలేని పాలన సాగిస్తోందన్నారు. మోదీ పాలనపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమన్నారు. విద్యుత్, ఎరువులు, రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. రాహుల్ గాం«దీకి దేశ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీ జిల్లా, మండల పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. వర్క్‌షాప్‌కు పలువురు డుమ్మా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఆర్.కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు హజరయ్యారు. ఎంపీ కె.లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, గోడెం నగేశ్ గైర్హాజరయ్యారు. -
కిషన్‌రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు ఇప్పుడు బయటపడిందా?, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కొంతమంది నేతలకు పొసగడం లేదా?, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయా? అంటే అవుననక తప్పదు.ఈ రోజు(ఆదివారం, జూన్ 1వ తేదీ) నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాపు చెప్పుకునేంత స్థాయిలో జరగలేదనేది అక్కడ హాజరైన నేతల తీరును బట్టే అర్థమవుతోంది. తప్పని సరిగా ఈ వర్క్ షాపుకు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలున్నా కొంతమంది నాయకులు వాటిని బేఖాతరు చేశారు. ‘ఆ మీటింగ్ కు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?’ అన్న చందంగా వ్యవహరించారు. మెజార్టీ ప్రజాప్రతినిధులుకిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాపుకు హాజరుకాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పైకి ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలిస్తున్నప్పటికీకిషన్రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.ప్రధానంగా దీనికి ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ లు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. పదకొండు మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు గాను మొత్తంగా నలుగురు మాత్రమే హాజరయ్యారు.ఎంపీల్లో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా, ధర్మపురి అరవింద్, గోడం నగేశ్ లు వర్క్ షాపుకు దూరంగా ఉన్నారు. ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో ఉండగా, బీజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పర్యటనలో ఉన్నారు. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం బీజేపీలో చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి:‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’ -
‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ప్రజలకు నీతివంతమైన పాలన అందించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్లుగా మోదీ పాలన అనేది ఎంతో పారదర్శకతతో సాగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘ మనం ప్రజల వద్దకు వెళ్లాలి. 11 ఏళ్ల మోదీ పాలనను ప్రజలకు వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలి. నీతివంతమైన పాలన అందించాం. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. గత యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయి.రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం ముందుకు పోతుంది. వన్ నేషన్ వన్ రేషన్ దేశంలో అమలు చేస్తున్నాం. ఉగ్రవాద రహిత దేశంగా చేసేందుకు మోదీ చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశామో అందరూ చూశారు. మోదీ ఆధ్వర్యంలో నయా దేశంగా భారత్13 వందల రైల్వే స్టేషన్ లను దేశంలో ఆధునీకరణ చేస్తున్నాం. వ్యాపార, వాణిజ్య, విద్యుత్ రంగుల్లో ఘనమైన అభివృద్ధి సాధించాం. దేశ అభివృద్ధి పై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కు సవాల్బీజేపీ మహిళా పక్షపాతి పార్టీ. కుల మతాలకు అతీతంగా పని చేస్తున్న ప్రభుత్వం. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నత తేడా ఉంది. ఆర్మీలో స్వయం ప్రతిపతి సాధించాం. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నాం. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిల్పాలన్నదే మోదీ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 10 లక్షల కోట్ల అప్పులు.. Brs, కాంగ్రెస్ రెండు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం. ప్రజా సమస్యల పై చిత్తశుద్ధితో పని చేస్తున్న పార్టీ బీజేపీ. బీజేపీ తప్పా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ కాపాడలేదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.