ఆ కంపెనీ యూజర్లకు 27జీబీ ఫ్రీ డేటా | Vodafone Giving Postpaid Users Free 27GB 4G Data for 3 Months | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీ యూజర్లకు 27జీబీ ఫ్రీ డేటా

Apr 25 2017 6:35 PM | Updated on Sep 5 2017 9:40 AM

ఆ కంపెనీ యూజర్లకు 27జీబీ ఫ్రీ డేటా

ఆ కంపెనీ యూజర్లకు 27జీబీ ఫ్రీ డేటా

వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో నెల 9జీబీ చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా డేటా అందించనున్నట్టు పేర్కొంది. మొత్తంగా 27జీబీ 4జీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ తన కస్టమర్లు రిలయన్స్ జియో నెట్ వర్క్ కు తరలిపోకుండా ఉండేందుకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే జియో తన కస్టమర్ల కోసం ధన్ ధనా ధన్ ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ  ఆఫర్ కు పోటీగా కంపెనీలు సైతం పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్ టెల్ సైతం తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు 30జీబీ ఉచిత డేటా ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ జూలై మధ్య వరకు అందుబాటులో ఉంటుంది. వొడాఫోన్ కొత్త ఆఫర్ కింద 9జీబీ ఉచిత డేటాను పోస్టు పెయిడ్ కస్టమర్లకు వినియోగించుకోవచ్చని, ఇది ఇప్పటికే ఉన్న తన ప్లాన్స్ లో భాగమని తెలిసింది.
 
ఇప్పటికే వొడాఫోన్ రెడ్ యూజర్లకున్న రూ.499 ప్లాన్ కింద నెలకు 3GB + 9GB డేటాను మూడు నెలల సద్వినియోగం చేసుకోవచ్చని వెల్లడవుతోంది. అదేవిధంగా 699 రూపాయల వొడాఫోన్ రెడ్ ప్లాన్ పై  5GB + 9GB డేటాను నెల పాటు పొందవచ్చు. ఈ డేటా ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలంటే పోస్టు పెయిడ్ కస్టమర్లు వొడాఫోన్ వెబ్ సైట్లోకి వెళ్లి, తమ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత, ఓటీపీ నెంబర్ వస్తోంది. ఆ ఓటీపీని వెబ్ సైట్ లో ఎంటర్ చేస్తే, ఉచిత డేటాను పొందవచ్చు. దీనికోసం వొడాఫోన్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలట.  కంపెనీ ఇటీవలే 352 రూపాయలతో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటాను ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించనున్నట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement