ఫర్ఫెక్ట్ సెల్ఫీతో వివో ఫోన్ వచ్చేసింది. | Vivo V5s With 20-Megapixel Selfie Camera, 'Moonlight Glow' Launched at Rs. 18,990 | Sakshi
Sakshi News home page

ఫర్ఫెక్ట్ సెల్ఫీతో వివో ఫోన్ వచ్చేసింది.

Apr 27 2017 3:02 PM | Updated on Sep 5 2017 9:50 AM

ఫర్ఫెక్ట్ సెల్ఫీతో వివో ఫోన్ వచ్చేసింది.

ఫర్ఫెక్ట్ సెల్ఫీతో వివో ఫోన్ వచ్చేసింది.

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఫర్ ఫెక్ట్ సెల్ఫీ హ్యాష్ ట్యాగ్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఫర్ ఫెక్ట్ సెల్ఫీ హ్యాష్ ట్యాగ్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. వివో వీ5ఎస్ పేరుతో గురువారం గురుగ్రామ్ లో జరిగిన ఈవెంట్లో ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతేడాది వివో వీ5ను కంపెనీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫోన్ ను అప్ డేట్ చేస్తూ.. ఫర్ ఫెక్ట్ సెల్ఫీ హ్యాష్ ట్యాగ్ తో కంపెనీ దీన్ని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కు 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా స్పెషల్ అట్రాక్షన్. 'మూన్ లైట్'  ఫ్లాష్ తో ఈ సెల్ఫీ కెమెరా వచ్చింది.  దీని ధర రూ.18,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త వివో ఫోన్ ప్రీబుకింగ్స్ గురువారం నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. 
 
తొలి సేల్ ను మే6న కంపెనీ చేపట్టబోతుంది. ఆ రోజున మేట్ బ్లాక్ రంగు వేరియంట్ ను అమ్మకానికి ఉంచనుంది. మే 20 నుంచే క్రౌన్ గోల్డ్ కలర్ వేరియంట్ అందుబాటులోకి రానుంది. సెల్ఫీ ఎడిటింగ్ కోసం ఫేస్ బ్యూటి యాప్ ను కంపెనీ ఈ ఫోన్ లో ప్రీలోడెడ్ గా ఉంచింది. వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలోతో రన్ అయ్యే ఈ ఫోన్ కు డ్యూయల్ సిమ్(మైక్రో+నానో) సౌకర్యముంది. హోమ్ బటన్ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్, 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే, 2.5డీ కర్వ్డ్ గ్లాస్, గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, పిక్సెల్ డెన్సిటీ, 1.5గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియా టెక్ ఎంటీ6750 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమెరీ, 4జీ వాయిస్  ఓవర్ ఎల్టీఈ, 3000ఎంఏహెచ్  నాన్ రిమూవబుల్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement