న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రైమ్ ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. ముఖ్యంగా దేశీయంగా ఆసుస్ ఫోన్లను కొత్తగా కొన్న యూజర్లకు శుభవార్త. రిలయన్స్ జియో తో భాగస్వామ్యంతో, ఆసుస్ ఎడిషనల్ డేలా పేరుతో ఒక పథకాన్ని అందిస్తోంది. తాజా ప్లాన్ ప్రకారం 10 రీఛార్జ్ లపై నెలకు 10జీబీ అదనపు డేటాను పొందవచ్చు. జూన్ 16, 2017,లేదా ఆ తరువాత అసుస్ స్మార్ట్‌ఫోన్లను కొన్న వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. వీరికి 10 నెలల పాటు నెలకు 10 జీబీ జియో 4జీ డేటా, మొత్తం 100 జీబీ డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. మూడు కేటగిరీలుగా ఈ ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది.
అయితే ఆసుస్ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్‌ను అసుస్ ఫోన్‌లో వేసి రూ.309 ఆపైన ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే చాలు. ఈ ఆఫర్ కింద వస్తున్న వినియోగదారులకు జియోలో రూ .309 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ వచ్చే రోజుకు 1జీబీ డేటాతోపాటుగా నెలకు 10 జీబీ డేటా లభించనుంది. క్రెడిట్ పొందడానికి రీఛార్జి తరువాత వినియోగదారులకు 48 గంటలు వేచి చేయాలి. పది నెలలకు అంటే.. మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 10 రీచార్జిలకు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చన్నమాట.
ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 (5.2), జెన్‌ఫోన్ 3 (5.5) ఫోన్లను వాడే వారికి నెలకు 10 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 100 జీబీ జియో 4జీ డేటా ఉచితంగా లభిస్తున్నది. అదేవిధంగా జెన్‌ఫోన్ 2, జెన్‌ఫోన్ 2 లేజర్, జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ఫోన్లను వాడుతున్న యూజర్లకు నెలకు 5జీబీ డేటా చొప్పున 10 నెలలకు 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్‌టీఈ ఫోన్లను వాడుతున్న వారికి నెలకు 3 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 30 జీబీ డేటా ఉచితం.
మై జియో యాప్‌లో అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసి ఈ దశలను పాటించాలి. యాప్ ఓపెన్ చేసి నా వోచర్లు -> వీక్షణ రసీదును -> నా నంబర్ రీఛార్జ్ -> రీఛార్జ్ నిర్ధారించండి -> రీఛార్జ్ సక్సెస్ నోటిఫికేషన్ వస్తుంది. అయితే జియో జతకట్టిన కంపెనీల్లో ఆసుస్ మొదటి కాదు. ఇంతకుముం‍్దు షియామి, జియోనీ కంపెనీ ఫోన్లలో కూడా జియో ఉచిత డేటాను ప్రకటించింది. మరోవైపు జూన్ నెలలో రిలయన్స్ జీయో 4 జి మొబైల్ స్పీడ్ చార్టులో టాప్‌లోఉందని ట్రాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జియో ప్రైమ్ యూజర్లకు మరో బంపర్ ఆఫర్
Published Sat, Jul 8 2017 4:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement