ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్ | yet another woman gang-raped in car in Delhi, three held | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్

Jun 17 2016 3:50 AM | Updated on Aug 1 2018 2:15 PM

కదులుతున్న కారులో ఒక యువతి (25)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున...

న్యూఢిల్లీ: కదులుతున్న కారులో ఒక యువతి (25)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన  యువతి... స్నేహితురాలితో కలసి వసంత్ విహార్‌లో ఒక మల్టీప్లెక్స్ నుంచి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను లోపలికి లాక్కున్నారు. రక్షించడానికి ప్రయత్నించిన స్నేహితురాలిని తోసేసి ఉడాయించారు. స్నేహితురాలు కారు  నంబర్ నోట్‌చేసుకొని పోలీసులకు ఫోన్ చేసింది.

వారు గీతాకాలనీలో కారును గుర్తించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. అప్పుడు కారులో యువతి లేదు. ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలికి ఫోన్‌చేసి తనను పూర్వి మార్గ్‌లో వదిలేశారని చెప్పింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement