అసెంబ్లీ 24 వ తేదీ వరకు పొడిగింపు | Winter session of Assembly should be extended | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ 24 వ తేదీ వరకు పొడిగింపు

Dec 19 2014 10:18 PM | Updated on Oct 30 2018 5:17 PM

నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 వరకు..

సాక్షి, ముంబై: నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం 19వ తేదీ వరకు సభ కార్యకలాపాలు ముగించాల్సి ఉంది. గతంలో నాగపూర్‌లో శీతాకాల సమావేశాలు మూడు వారాలపాటు కొనసాగాయి. ఇప్పుడూ అదే విధానాన్ని అనుసరించాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు.

ఈ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే కొనసాగుతున్నాయి. దీంతో  ప్రవేశపట్టాల్సిన తీర్మానాలు, మంజూరు చేయాల్సిన బిల్లులు, జీరో అవర్స్‌లో లేవనెత్తే ప్రశ్నలు తదితరా సభా కార్యకలాపాలు ఇంకా పూర్తికాలేదు. దీంతో సభ కార్యకలాపాలు నాలుగు వారాల పాటు నిర్వహించాలని ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ డిమాండ్ చేశారు. కాని విధాన సభ అధ్యక్షుడు హరీభావ్ భాగడే కల్పించుకుని ఈ సమావేశాలను 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement