ఆ అమ్మాయి మనసును కలుషితం చేస్తున్నారు | Who's polluting gurmehar kaurs mind: Kiren Rijiju | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి మనసును కలుషితం చేస్తున్నారు

Feb 27 2017 1:13 PM | Updated on Sep 5 2017 4:46 AM

ఆ అమ్మాయి మనసును కలుషితం చేస్తున్నారు

ఆ అమ్మాయి మనసును కలుషితం చేస్తున్నారు

కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌మెహర్ కౌర్‌ వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు.

న్యూఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌మెహర్ కౌర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. గుర్‌మెహర్ కౌర్ మనసును ఎవరు కలుషితం చేస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా కౌర్ ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. ఏబీవీపీని విమర్శించినందుకు కొందరు తనను రేప్ చేస్తామని హెచ్చరించారని ఆ తర్వాత ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గుర్‌మెహర్‌ మనసును ఎవరో కలుషితం చేస్తున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement