ఇండియన్ ప్రిన్సెస్ 2014 గ్రాండ్ ఫైనల్ పోటీలు ఈ నెల 18న ముంబైలో జరగనున్నాయి.
ముంబై: ఇండియన్ ప్రిన్సెస్ 2014 గ్రాండ్ ఫైనల్ పోటీలు ఈ నెల 18న ముంబైలో జరగనున్నాయి. రత్నగిరిలోని బ్లూ ఓషియన్ రిసార్ట్ అండ్ స్పా మాల్గుంద్‌లో ఇండియన్ ప్రిన్సెస్ అండ్ ఇండియన్ ప్రిన్సెస్ ఇంటర్నేషనల్-2014 ఆధ్వర్యంలో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. భారత్‌తో పాటు వివిధ దేశాలలోని 25 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
ఫ్యాషన్ షో మాదిరిగానే నిర్వహించిన బీచ్ వాక్, ర్యాంప్ వాక్, పద సరళి, గాత్ర పరిశీలన తదితర అంశాల్లో పోటీదారులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, అమెరికా, మలేసియా, ఉగాండా, న్యూజిలాండ్, ఇటలీ, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, థాయిలాండ్ తదితర దేశాలతో పాటు భారత్‌కు చెందిన భామలు ర్యాంప్‌పై హొయలొలికించారు. ఆట, పాటలతో సందడి చేశారు.
కాగా, ఐదేళ్ల నుంచి నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిన్సెస్ పోటీలు ఫ్యాషన్ ప్రపంచంలోని అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి. కాగా, దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన సైనికులకు గౌరవార్థం ఇండియన్ ప్రిన్సెస్ అండ్ ఇండియన్ ప్రిన్సెన్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో బాలికలకు విద్యను అందించాలన్న సామాజిక సందేశాన్ని ప్రజల్లోకి చేరవేసేందుకు ఈ పోటీలను వేదికగా ఉపయోగించుకుంటున్నారు.