ఒంటి నిండా బంగారంతో రౌడి దర్జా

Varichiyur Selvam Visit Athi Varadar Temple - Sakshi

చెన్నై(తమిళనాడు): మదురైలో అతడో పేరుమోసిన రౌడి. అతడిపై రౌడీషీటేకాదు ఏకంగా 14 కేసులు ఉన్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం, దందా సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి పేరు వరిచియూర్ సెల్వం. మధురైలో అతడి పేరు చెబితే భయంతో జనం హడలిపోతారు. ఎంత పెద్ద రౌడి అయినప్పటికీ అతడికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి బంగారం, రెండోది దైవం. కేజీలకు కేజీల బంగారు నగలు వేసుకోవటమంటే సెల్వంకు పిచ్చి. అదే సమయంలో దేవుడంటే మహా భక్తి భయం కూడా.

ఒంటి నిండా బంగారంతో కాంచిపురంలోని అత్తివరదర్ ఆలయాన్ని దర్శించుకోవాలనే కోరిక అతడికి కలిగింది. అనుకున్నదే తడవుగా మదురై పోలీసు కమిషనర్ ద్వారా కాంచిపురం ఎస్పీకి సమాచారం పంపించి అత్తివరదర్ దర్శనానికి వచ్చాడు. అంతే మనోడికి పోలీసులు రాచమర్యాదలతో స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించి జాగ్రత్తగా పంపించివేశారు. ఒంటినిండా బంగారంతో ఓ రౌడి సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడంపై స్థానికులు వింతగా చర్చించుకుంటున్నారు. రౌడీనా మజాకా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top