వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
Oct 21 2016 4:35 PM | Updated on Sep 4 2017 5:54 PM
రాయచోటి: వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. గాలివీడు మండలం గోపనపల్లె గ్రామం నక్కవాండక్లపల్లెకు చెందిన నారాయణమ్మ కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చిందని.. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
Advertisement
Advertisement