
కల్తీ మద్యం తాగి యువకుడి మృతి
కల్తీ మద్యం సేవించి ఓ యువకుడు మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు...
దొడ్డబళ్లాపురం : కల్తీ మద్యం సేవించి ఓ యువకుడు మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు... దొడ్డబళ్లాపురం తాలూకాలోని కల్లురదేవనహళ్లికి చెందని లోకేష్(25) డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన ఇతను పనులకు వెళ్లకుండా మద్యం మత్తులో ఉండేవాడు. ఆదివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి చేరుకున్న అతను తిరిగి నిద్ర లేవలేదు.
అతన్ని నిద్రలేపేందుకు తల్లి అంజినమ్మ ప్రయత్నించింది. ఆ సమయంలో అతనిలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె ఇరుగుపొరుగువారిని పిలిచి విషయం తెలిపింది. గమనించిన వారు అతను మరణించినట్లు తెలపడంతో తల్లి వేదనకు అంతులేకుండా పోయింది.