చెత్త సమస్యకు చెక్ | The worst problem, check | Sakshi
Sakshi News home page

చెత్త సమస్యకు చెక్

Jun 24 2014 2:48 AM | Updated on Oct 1 2018 6:38 PM

చెత్త సమస్యకు చెక్ - Sakshi

చెత్త సమస్యకు చెక్

దేశంలోని 500 నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించడానికి బయో మెథానేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు.

  • దేశంలోని 500 నగరాల్లో ‘బయో మెథానేషన్’
  •  వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు
  •  బెంగళూరు కేఆర్ మార్కెట్‌లో ఏర్పాటుకు శంకుస్థాపన
  •  కేంద్ర మంత్రి అనంత కుమార్
  • బెంగళూరు : దేశంలోని 500 నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించడానికి బయో మెథానేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి కేఆర్ మార్కెట్‌లో రూ. 102 కోట్లతో ఆ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    కేఆర్ మార్కెట్ నుంచి రోజూ ఐదు వేల కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నాయన్నారు. నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, బెంగళూరు నగర ఇన్‌చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టే సత్యనారాయణ, బెంగళూరు నగరంలోని ఎంపీలు, శాసన సభ్యులు చర్చించి  కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఇప్పటికే సూచిం చామన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement