గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వరదలో చిక్కుకున్నారు.
గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వరదలో చిక్కుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలోని గోదావరిలో చేపలు పట్టేందుకు కొందరు వ్యక్తులు వె ళ్లారు. ఇద్దరు మాత్రం వరదలో చిక్కుకున్నారు. రాత్రంతా నీటిలోనే ఉండిపోయారు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో సోమవారం ఉదయం వారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా వీలుపడలేదు. సమాచారం అందుకున్న అధికారులు వారిని హెలికాప్టర్ రప్పించి బయటకు తెచ్చేందుకు యత్నాలు ప్రారంభించారు.