పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మొగల్తూరులో ఉద్రిక్తత
Mar 30 2017 3:02 PM | Updated on Sep 5 2017 7:30 AM
మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఆనంద్ ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతిచెందడంతో.. ఆగ్రహించిన గ్రామస్థులు పరిశ్రమపై దాడి చేశారు. మృత దేహాలను ఫ్యాక్టరీ ఎదుట ఉంచి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆగ్రహించిన ఆందోళన కారులు ఫ్యాక్టరీ పై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.
Advertisement
Advertisement