టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ నిర్వాహకం | TCS Software Ras behaviour with a woman | Sakshi
Sakshi News home page

టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ నిర్వాహకం

May 11 2017 8:35 PM | Updated on Sep 5 2017 10:56 AM

నగరంలో మరో లైంగిక దౌర్జన సంఘటన వెలుగు చూసింది.

శివాజీనగర : నగరంలో మరో లైంగిక దౌర్జన సంఘటన వెలుగు చూసింది. వెలుతున్న బీఎంటీసీ వోల్వో బస్సులో యువతిపై ఓ కామాంధుడు లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన తక్షణమే వెంటాడిన పింక్‌  హోయ్సళ పోలీసులు బనశంకరిలోని మధుసుధన్‌రావు (47) ను అరెస్టు చేశారు. నిందితుడు టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వివరాలీవి ... ఇబ్లూరు రింగురోడ్డులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బస్సు ప్రయాణిస్తున్న వ్యక్తి  ముందు సీట్లో కూర్చున్న 29 సంవత్సరాల వయస్సు కలిగిన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

అంతటితో ఆగకుండా ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తక్షణమే ఆ యువతి ఇంటర్నెట్‌లో బెళందూరు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ నెంబర్‌ తీసుకుని పోలీసులకు ఫోన్‌ చేసింది. వెనువెంటనే పింక్‌  హోయ్సళ వాహనాన్ని ఇన్‌స్పెక్టర్‌ విక్టర్‌  అలర్ట్‌ చేశాడు. యువతితో సంప్రదిస్తున్న పోలీసులు బస్సు వెళుతున్న మార్గాన్ని చూచి ఆ బస్సును ఆపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుకు కేసు నమోదు చేశారు. ఆ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలు కూడా ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తుంది. పింక్ హోయ్సళ రంగప్రవేశం చేసి పట్టుకున్నకేసులో ఇదే మొదటిదే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement