మేము సైతం అంటున్న హిజ్రాలు

Tamil nadu Hijras Helping Poor People in Lockdown Time - Sakshi

తమిళనాడు, కోరుక్కుపెట: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందుకొచ్చారు హిజ్రాలు. దాతల సహకారంతో హిజ్రాల సంక్షేమ సంఘ సభ్యులు తమ ట్రస్ట్‌ తరఫున 140 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్ల విద్య, ఉపాధి, సాధికారత కోసం పనిచేసే బోర్న్‌ టు విన్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు సి.స్వేత మాట్లాడుతూ  ట్రాన్స్‌జెండర్ల సహాయంతో, ఆమె 140 మందికి నిత్యావసర వస్తువులు  అందించారు. బిల ట్రాన్స్‌జెండర్‌ రైట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు ఆర్‌.జీవా పాల్గొన్నారు. అలాగే ఆర్మీ సిబ్బంది సైతం రోడ్డు పక్కన ఉన్న పేదలకు ఆహారాన్ని అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top