పన్నీరు సెల్వం రాజీనామా ఆమోదం | Tamil Nadu Governor accepts Panneerselvam resignation | Sakshi
Sakshi News home page

పన్నీరు సెల్వం రాజీనామా ఆమోదం

Feb 6 2017 1:03 PM | Updated on Sep 5 2017 3:03 AM

పన్నీరు సెల్వం రాజీనామా ఆమోదం

పన్నీరు సెల్వం రాజీనామా ఆమోదం

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావు ఆమోదించారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావు ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసేంత వరకు పదవిలో కొనసాగాల్సిందిగా పన్నీరు సెల్వంను కోరారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్ నుంచి ఈ  మేరకు ప్రకటన వచ్చింది.

ఆదివారం అన్నా డీఎంకే రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాల్సిందిగా కోరుతూ లేఖను గవర్నర్కు పంపారు. నిన్న అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి శశికళ పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ నిర్ణయాలు తెలియజేసేందుకు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరారు.

చదవండి: చిన్నమ్మే చీఫ్ మినిస్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement