వరంగల్ జిల్లా కమలాపూర్‌లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు.
మంత్రి ఈటల ఇంటి ముట్టడి
Oct 28 2016 2:32 PM | Updated on Sep 5 2018 9:18 PM
వరంగల్ అర్బన్ : వరంగల్ జిల్లా కమలాపూర్‌లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు మంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement