కృష్ణా జిల్లా కేతనకొండలో డెంగీ జ్వరంతో ఓ విద్యార్థిని బుధవారం మృతి చెందింది.
డెంగీతో విద్యార్థిని మృతి
Oct 12 2016 6:52 PM | Updated on Nov 9 2018 4:36 PM
ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా కేతనకొండలో డెంగీ జ్వరంతో ఓ విద్యార్థిని బుధవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన పులి మరియమ్మ కుమార్తె తబితారాణి (16) స్థానిక కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. వారం కిందట జ్వరం బారిన పడడంతో గొల్లపూడిలోని ఓప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. ప్లేట్‌లెట్స్ పూర్తిగా తగ్గాయని, డెంగీ జ్వరమని వైద్యులు చెప్పినట్టు బంధువులు తెలిపారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తబితారాణి మృతిచెందింది.
Advertisement
Advertisement