సీతారాముల కళ్యాణం బుధవారం ఉదయం భద్రాద్రిలో కన‍్నులపండువగా జరిగింది.
రామయ‍్యకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం మనవడు
Apr 5 2017 2:13 PM | Updated on Aug 14 2018 11:02 AM
ఖమ‍్మం: సీతారాముల కళ్యాణం బుధవారం ఉదయం భద్రాద్రిలో కన‍్నులపండువగా జరిగింది. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వ‍్యక్తిగతంగా రాములోరికి పట్టువస్త్రాలను సమర్పించారు. అయితే సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. దీంతో కుటుంబం తరపున ఆయన మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ప్రభుత‍్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారికంగా పాల్గొన్నారు. కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement