సీగల్ ఇన్ఫోటెక్ సంస్థ ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం
Nov 25 2016 2:36 PM | Updated on Sep 19 2019 2:50 PM
విశాఖ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వాళ్లను మోసం చేసిన సంస్థపై బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. నగరంలోని సీగల్ ఇన్ఫోటెక్ సంస్థ ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసింది. పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన నిరుద్యోగులు తమ ఉద్యోగాల మాటేమిటి అని నిలదియడంతో చేతులెత్తేసింది. దీంతో బాధితులు సంస్థపై నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Advertisement


