కారు అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షల చోరీ | Rs 3 lakh theft from car | Sakshi
Sakshi News home page

కారు అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షల చోరీ

Sep 28 2016 2:12 PM | Updated on Sep 4 2017 3:24 PM

గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షలు చోరీ చేశారు.

గుర్తుతెలియని వ్యక్తులు కారు(టీఎస్07ఈడీ2000) అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోటుచేసుకుంది. బాబాగూడ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి వ్యాపారం కోసం తనతో తీసుకువచ్చిన రూ.3 లక్షల్ని కారులో ఉంచి పోలీసుస్టేషన్ ఎదుట ఉన్న ఆఫీసులోకి వెళ్లాడు. వెళ్లి వచ్చి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉంచిన రూ.3 లక్షల నగదు కూడా తస్కరించారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement