గామన్ ఇండియా సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌పై సత్వరమే ఓ నిర్ణయం తీసుకోవాలంటూ స్థానిక హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం
‘మెట్రో’ కాంట్రాక్టు కేటాయింపు వివాదంపై హైకోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గామన్ ఇండియా సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌పై సత్వరమే ఓ నిర్ణయం తీసుకోవాలంటూ స్థానిక హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. అత్యంత తక్కువ బిడ్‌ను దాఖలుచేసినప్పటికీ తనకు మెట్రో రైలు ప్రాజెక్టును కేటాయించపోవడాన్ని సవాలుచేస్తూ గామన్ సంస్థ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. తుదినిర్ణయం వెలువడేదాకా యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్... హైకోర్టును ఆదేశించారు.