రివేరా ఫ్యాషన్ షో అదుర్స్ | Riviera Fashion Show Hosts | Sakshi
Sakshi News home page

రివేరా ఫ్యాషన్ షో అదుర్స్

Feb 8 2014 1:07 AM | Updated on Sep 2 2017 3:27 AM

వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని రివేరా-2014 అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి విద్యార్థుల ఫ్యాషన్‌షో జరిగింది.

వేలూరు, న్యూస్‌లైన్ : వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని రివేరా-2014 అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి విద్యార్థుల ఫ్యాషన్‌షో జరిగింది. ఈ పోటీల్లో 400 యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రకరకాల దుస్తులు ధరించి పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతల నడుమ జరిగిన ఈ పోటీల్లో చెన్నై ఎన్‌ఐఎఫ్‌టీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాల్లో  గెలుపొందిన విద్యార్థులకు నగుదు బహుమతితో పాటు సర్టిఫికెట్లును వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అందజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్‌వో 2009 సర్టిఫికెట్లు పొందిన  ఈ అంతర్జాతీయ రివేరా సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సుమారు 24 వేల  విద్యార్థులు ఈ పోటీల్లో కలుసుకోవడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో వివిధ దేశాలకు, యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ప్యాషన్ షోలో పాల్గొనడం అభినందనీయమన్నారు.

ఈ పోటీలు ఈనెల 9వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివిధ పోటీలు నిర్వహించి సుమారు *2 కోట్లు విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, వైస్ చాన్స్‌లర్ రాజు, త్రొ చాన్స్‌లర్ నారాయణన్, ప్రొఫెసర్లు, వివిధ యూనివర్సిటీ చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement