హైటెక్ వేశ్య కేంద్రంపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

హైటెక్ వేశ్య కేంద్రంపై పోలీసుల దాడి

Published Sun, Jul 13 2014 10:55 AM

Prostitution racket busted in Bangalore

ప్రవాసాంధ్రులు అధికంగా నివాసముండే ప్రాంతంలో హైటెక్ వేశ్య కేంద్రం బయటపడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర అలజడి ఏర్పడింది. నిందితులు మురడేశ్వర సమీపంలోని ఉత్తరకోప్పకు చెందిన దుర్గయ్య, హాసన్ జిల్లా చెన్నరాయణపట్ట తాలుకా హిరిసావా గ్రామానికి చెందిన దీపు, అదే జిల్లా సకలేశపుర తాలుకా బాళగెద్ద గ్రామానికి చెందిన కుమార్, బెంగళూరు కేఆర్ పురంలోని గాయత్రీ లేఔట్‌కు చెందిన నాగరాజ్ అలియాస్ జాన్సన్‌లను అరెస్టు చేశామని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.
 
 కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు ఒక బంగాదేశ్‌కు చెందిన యువతిని రక్షించామని చెప్పారు. పాస్‌పోర్టు లేని బంగ్లా యువతిపై కేసు నమోదు చేశామని అన్నారు. దేవసంద్ర సమీపంలోని ఆర్‌ఎంవీ రెండో స్టేజ్‌లోని ఒక ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో బంగ్లాదేశ్, కోల్‌కత్తాకు చెందిన యువతులను నిర్బంధించి బయట ప్రాంతాల నుంచి విటులను తీసుకువచ్చి దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ది ఫ్రీడం ప్రాజెక్ట్ ఇండియా నిర్వాహకులు గుర్తించారు.
 
 కొన్ని రోజులుగా ఈ ప్రాంతంపై నిఘా పెట్టిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జయణ్ణ పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
 

Advertisement
Advertisement