ఒక బంగ్లా ఉన్నపుడు మరొకటి అవసరం లేదనేది తమ అభిప్రాయమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
ఒక బంగళా ఉంటే మరొకటి ఎందుకు?
Nov 28 2016 2:39 PM | Updated on Sep 29 2018 4:44 PM
హైదరాబాద్: ఒక బంగ్లా ఉన్నపుడు మరొకటి అవసరం లేదనేది తమ అభిప్రాయమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉన్న బంగళా సరిపోక పోతే మరో బ్లాక్ నిర్మించుకుంటే సరిపోయేదన్నారు. ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద బంగళా కట్టిన సీఎం కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడం ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.
ఈ నెల 30న భూనిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరుగుతుందని తెలిపారు. సదస్సుకు కాళేశ్వరం, ఓపెన్‌కాస్ట్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్వాసితులందరినీ పిలుస్తున్నామన్నారు. నిర్వాసితుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోధకులు అనే భావనను ప్రభుత్వం విడనాడాలన్నారు. వారి సమస్యలు వినకుండా దబాయింపుతో భూములు లాక్కోవడం సరికాదన్నారు.
Advertisement
Advertisement