పరారీ ..! | Police search for Karthik | Sakshi
Sakshi News home page

పరారీ ..!

Aug 31 2014 4:05 AM | Updated on Aug 21 2018 5:46 PM

పరారీ ..! - Sakshi

పరారీ ..!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడ కోసం పోలీసులు గాలిస్తున్నారని బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ ఎస్ రవి తెలిపారు.

  •  కార్తీక్ కోసం పోలీసుల గాలింపు  
  •  ఇంటిలో నోటీసులు ఇచ్చిన వైనం
  •  మైత్రేయిని పలుమార్లు విచారించిన అధికారులు
  • బెంగళూరు : కేంద్ర రైల్వే శాఖ  మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడ కోసం పోలీసులు గాలిస్తున్నారని బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ ఎస్ రవి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం సంజయ్‌నగరలోని సందానందగౌడ ఇంటికి పోలీసులు వెళ్లారని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిపారు. దీంతో పోలీసులు ఆ ఇంటిలో పని చేస్తున్న వారికి నోటీసులు అందించారని, విచారణకు హాజరు కావాలని కార్తీక్‌గౌడకు చెప్పాలని సూచించినట్లు వెల్లడించారు.

    అయితే 24 గంటలైనా కార్తీక్‌గౌడ విచారణ నిమిత్తం సంజయ్‌నగర్ పోలీసుల ముందు హాజరుకాలేదన్నారు. ఆర్టీ నగర్ పోలీసులు సినీ నటి మైత్రేయిని  శుక్ర, శనివారాల్లో పలుమార్లు విచారణ చేశారని తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షలలో మైత్రేయిపై కార్తీక్‌గౌడ అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అయితే వైద్యులిచ్చే ఫైనల్ రిపోర్టులో అసలు విషయం తెలుస్తుందని చెప్పారు.
     

Advertisement
 
Advertisement
Advertisement