
నగరానికి మరో మెట్రో
రాజధాని నగరం చెన్నైలో మరో మూడు మార్గాల్లో మెట్రో రైలు పనులకు నివేదిక సిద్ధం చేసి ఉన్నారు.
మాధవరం టూ పెరుంబాక్కం
సిరుచ్చేరి వైపుగా కూడ
నెర్కుండ్రం లైట్ హౌస్‌కు పరిశీలన
88 కి.మీ దూరం పనులు
అంచనా వ్యయంగా రూ. 44 వేల కోట్లు
నివేదిక సిద్ధం
చెన్నై : రాజధాని నగరం చెన్నైలో మరో మూడు మార్గాల్లో మెట్రో రైలు పనులకు నివేదిక సిద్ధం చేసి ఉన్నారు. మాధవరం నుంచి పెరంబాక్కం, సిరుచ్చేరి, నెర్కుండ్రం నుంచి లైట్ హౌస్ మీదుగా ఈ మార్గాల పనులకు చర్యలు తీసుకుని ఉన్నారు. 88 కి.మీ దూరం చేపట్టనున్న ఈ పనులకు అంచనా వ్యయంగా రూ. 44 వేల కోట్లగా నిర్ణయించి ఉన్నారు. రాజధాని నగరం చెన్నైలో రెండు మార్గాల్లో మెట్రో రైలు పనులు సాగుతున్న విషయం తెలిసిందే.
కోయంబేడు - ఆలందూరు మధ్య పనులు ముగిసి రైలు పరుగులు తీస్తున్నది. ఇక, మరికొన్ని నెలల్లో విమానాశ్రయం వరకు రైలు పయనం సాగబోతోంది. అలాగే, కోయంబేడు నుంచి సెంట్రల్ మీదుగా పాత చాకలి పేట వరకు పనుల వేగం పెరిగి ఉన్నది. అలాగే, సెంట్రల్ నుంచి అన్నా సాలై మీదుగా పనులు సాగుతూ వస్తున్నాయి. ఈ పనులన్నీ మరో ఏడాదిన్నరలో ముగించే రీతిలో కార్యాచరణతో ప్రాజెక్టు వర్గాలు పయనం సాగిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో రాజధాని నగరంలో మరో మూడు మార్గాల్లోనూ మెట్రో పనులకు కసరత్తులు జరిగి ఉన్నాయి.
మరో మూడు మార్గాల్లో : మాధవరం నుంచి రెట్టేరి, కొళత్తూరు, పాడి, వలసరవాక్కం, ఆళ్వార్ తిరునగర్, రామాపురం, పరింగి మలై, ఉలగరం, కీల్ కట్టలై, కైలాశ్ నగర్ మీదుగా పెరుంబాక్కంకు ఓ మార్గం, మాధవరం నుంచి మూలకడై, పెరంబూరు, కేఎంసీ, నుంగంబాక్కం, స్టెల్లా మేరీస్, మందవేలి, అడయార్, పాలవాక్కం, నీలంకరై మీదుగా సిరుచ్చేరికి రెండో మార్గం పనులకు కసరత్తులు చేశారు.
మూడో మార్గంగా నెర్కుండ్రం నుంచి కోయంబేడు, చిన్మయనగర్, శాలిగ్రామం, పనగల్ పార్క్, అడయార్ గేట్ మీదుగా లైట్ హౌస్‌కు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. మొత్తంగా 88 కి.మీ దూరం పనులు సాగించే రీతిలో నివేదికను సిద్ధం చేసి ఉన్నారు. ఇందుకు గాను అంచనా వ్యయంగా రూ. 44 వేల కోట్లుగా నిర్ణయించి ఉన్నారు. చెన్నైలో ఈ మూడు మార్గాల కోసం రెండు చోట్ల రైల్వే వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఉన్నారు. అయితే, ఈ నివేదిక పరిశీలనతో ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు.