మణిరత్నం మెచ్చిన నటి | Nithya Menen, Mani Ratnam collaborate again for revenge thriller | Sakshi
Sakshi News home page

మణిరత్నం మెచ్చిన నటి

Sep 21 2015 3:24 AM | Updated on Sep 3 2017 9:41 AM

మణిరత్నం మెచ్చిన నటి

మణిరత్నం మెచ్చిన నటి

సినిమాల్లో కెమిస్ట్రీ అంటారే అది అందరూ వాడే పదంగా మారినా నిజంగా అయితే కొందరి మధ్యనే వర్కౌట్ అవుతుంది.అదే విధంగా చాలా చిత్రాలకు

 సినిమాల్లో కెమిస్ట్రీ అంటారే అది అందరూ వాడే పదంగా మారినా నిజంగా అయితే కొందరి మధ్యనే వర్కౌట్ అవుతుంది.అదే విధంగా చాలా చిత్రాలకు జరిగే విషయం ఏమిటంటే చిత్రం పూర్తి అయ్యేలోపు దర్శకుడికి నిర్మాతకు మధ్య గానీ,దర్శకుడికి హీరోకు,లేదా హీరోయిన్ మధ్య భేదాభిప్రాయాలాంటి కలగడం సర్వసాధారణంగా మారింది.అయితే కొందరి మధ్య మాత్రం మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది.దీన్నే కెమిస్ట్రీ,ఫిజిక్స్,బయాలజీ వగైరా వగైరా అంటారేమో.అలా కోలీవుడ్‌లో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిన కొందరి గురించి చెప్పుకోవాలంటే దర్శకుడు శంకర్- నటుడు విక్రమ్,ఏఆర్.మురుగదాస్-విజయ్,మణిరత్నం-ఐశ్వర్యారాయ్‌లను ప్రస్తావించవచ్చు.

అందుకే శంకర్ దర్శకత్వంలో విక్రమ్ విలన్‌గా నటించడానికి కూడా వెనుకాడలేదు.అలాగే మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి ఐశ్వర్యారాయ్ ఎనీటైమ్ రెడీ అంటారు.ఇక తాజాగా నటి నిత్యామీనన్ కూడా మణిరత్నం మెచ్చిన నటి అయ్యారు.ఓ కాదల్ కణ్మణి చిత్రంలో ఈ బ్యూటీ నటన మణిరత్నంను ముగ్ధుణ్ని చేసిందట. ఈ కారణం గానే తన తాజా చిత్రంలోనూ నిత్యకు చోటిచ్చారు. మణిరత్నం రూపొందించనున్న నూతన చిత్రంలో కార్తీ,దల్కర్ సల్మాన్, కీర్తీసురేశ్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.లేటెస్ట్‌గా నిత్యామీనన్ ఎంపికైనట్లు తాజా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement