నిన్న మొన్నటి వరకూ లగేజ్‌లోనో, బట్టల్లోనో, అండర్ గార్మెంట్స్‌లోనే బంగారాన్ని అక్రమంగా తరలించి విమానాశ్రయాల్లో పట్టుబడిన వార్తలు చూశాం.
	ముంబయి : నిన్న మొన్నటి వరకూ లగేజ్‌లోనో, బట్టల్లోనో, అండర్ గార్మెంట్స్‌లోనే బంగారాన్ని అక్రమంగా తరలించి విమానాశ్రయాల్లో పట్టుబడిన వార్తలు చూశాం. తాజాగా పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌తో కొత్తనోట్లను తరలించేందుకు అక్రమార్కులు కొత్తపంథాను ఎంచుకున్నారు. కొత్త రెడీమేడ్ దుస్తుల  మాటున కొత్తనోట్ల కట్టలను చక్కగా ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించారు.
	
	అయితే అనుమానం వచ్చిన అధికారులు  ఆ రెడిమేడ్ గార్మెంట్‌ను తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. బట్టలు నలిగిపోకుండా, సపోర్టుగా ఉంచే అట్టముక్కల మధ్యలో కొత్త 2వేల నోట్లు కవర్లలో ఉంచి ప్యాక్ చేశారు. ఒక్కో దానిలో నోట్ల కవర్లు నాలుగు ఉండటం విశేషం. ఈ ఘటన ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కాగా ముంబయి నుంచి దుబాయి వెళుతున్న ప్రయాణికుల నుంచి లక్షల విలువైన రెండువేల నోట్లను అధికారులు స‍్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుల వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
	
	
	

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
