ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌పై ఎన్‌జీటీ ఆగ్రహం | National Green Tribunal flays DTC over report on inspection of buses | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌పై ఎన్‌జీటీ ఆగ్రహం

Feb 26 2015 10:52 PM | Updated on Sep 2 2017 9:58 PM

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)తో కలిసి బస్సుల ప్రమాణాల పరీక్షించి నివేదికను సమర్పించడంలో విఫలమైన ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్

 న్యూఢిల్లీ: కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)తో కలిసి బస్సుల ప్రమాణాల పరీక్షించి నివేదికను సమర్పించడంలో విఫలమైన ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)పై జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఢిల్లీలోని బస్సులను ఎవరు పర్యవేక్షిస్తారని, ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించిన ఒక్క బస్సు నివేదికనైనా తమకు ఇవ్వాలని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండడంతో వాటి మూలాలను కనుగొని అడ్డుకట్ట వేయాలని వర్ధమాన కౌశిక్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు.
 
 డీటీసీ బస్సులు, గ్యాస్ ఆధారిత బస్సుల ప్రమాణాలను డీటీసీ, సీపీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యుల బృందం పరీక్షించి నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విర్ధుంగా ఉన్నవాటిని రోడ్ల మీద తిరగనివ్వద్దని 2014 నవంబరు 26న ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బస్సులన్ని ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని న్యాయవాది అవ్నిష్ అల్హావాట్ డీటీసీ తరుఫున వాదించారు. కానీ ధర్మాసనం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో రవాణా శాఖ సంయుక్త కమిషనర్ 186 బస్సులు కాలుష్య నియంత్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 2014 డిసెంబర్ 28న నివేదిక సమర్పించారు. దీంతో 15 ఏళ్లనాటి వాహనాలను రోడ్ల మీద తిరగకుండా నిషేధం విధించింది, ఒక వేళ అలాంటి వాహనాలు దేశ రాజధానిలో తిరిగితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement