ఘోర్పడి ప్రాంతంలోని బాలాజీ మందిరాన్ని బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ బాపట్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుణే సిటీ, న్యూస్‌లైన్: ఘోర్పడి ప్రాంతంలోని బాలాజీ మందిరాన్ని బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ బాపట్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోపాల్ చింతల్, దిలీప్ కవడే, కంటోన్మెంట్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ మంత్రి, బాలాజీ మం దిర మాజీ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌రెడ్డి, కె.చెం చయ్య, కార్యవర్గ సభ్యులు సుబ్బారాయుడు పాల్గొన్నారు.