భయపెడుతున్న ‘వార్దా’ | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న ‘వార్దా’

Published Thu, Dec 8 2016 7:39 PM

Met predicts less impact of Cyclone 'VARDAH' on Andhra Pradesh

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకు వస్తోన్న ఈ తుపానుకు ‘వార్దా’  పేరు పెట్టారు. విశాఖకు ఆగ్నేయంగా 1040 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1135 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ నెల 12న నెల్లూరు-కాకినాడ మధ్య తుపాను తీరం దాటే అవకాశముంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తుపాను తీరం దాటనుంది. తీరం దాటే ముందే తుపాను బలహీనపడనుంది. తుపాను ప్రభావంతో 11 నుంచి కోస్తా వర్షాలు కురుస్తాయని, బలంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement