ముంబై’ పేలుళ్ల దోషికి క్షమాభిక్ష నిరాకరణ | Mercy Plea of Yakub Memon Rejected by President | Sakshi
Sakshi News home page

ముంబై’ పేలుళ్ల దోషికి క్షమాభిక్ష నిరాకరణ

May 22 2014 1:53 AM | Updated on Sep 2 2018 5:20 PM

1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు.

న్యూఢిల్లీ: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి ఆ నిర్ణయం తీసుకున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముంబై పేలుళ్ల కుట్రలో కీలకపాత్ర, అందుకు ఆర్థిక సాయం చేయడం, పేలుళ్లలో పాలు పంచుకున్న ఇతరులకు ఆ డబ్బు పంపిణీ చేయడం.. తదితర నేరాలపై 2007లో టాడా కోర్టు యాకూబ్ మెమన్‌కు మరణశిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును 2013 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు సమర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement