సౌదీలో మెదక్‌ జిల్లా వాసి మృతి | Medak district person died in the road accident at Saudi | Sakshi
Sakshi News home page

సౌదీలో మెదక్‌ జిల్లా వాసి మృతి

Jan 2 2017 3:34 AM | Updated on Aug 30 2018 4:10 PM

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మం డలం కామారం తండాకు చెందిన కటవత్‌ రవి(40) సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

చిన్నశంకరంపేట: మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మం డలం కామారం తండాకు చెందిన కటవత్‌ రవి(40) సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం కలిబులిలో రోడ్డు పక్కన ఇసుకను లోడ్‌ చేస్తుండగా రవిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అత ను మరణించాడు.

రవి విజిట్‌ వీసాపై వెళ్లి అక్కడే పది నెలలుగా ఉన్నట్లు అతని సోదరుడు హరినాయక్‌ తెలిపారు. రవి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహకరించాలని గిరిజనులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement