రోడ్డు భద్రత కు మారథాన్ | Marathon to road safety | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత కు మారథాన్

Jan 6 2014 3:54 AM | Updated on Aug 30 2018 5:35 PM

రోడ్డు భద్రతపై అవగాహ నకల్పించేం దుకు మినీ మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నందగోపాల్ తెలిపారు.

వేలూరు, న్యూస్‌లైన్: రోడ్డు భద్రతపై అవగాహ నకల్పించేం దుకు మినీ మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. వేలూరు కరుగంబత్తూరులో ఎకే గ్రూప్స్ చారిటబుల్ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, గ్లోబల్ వార్మింగ్‌పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మినీ మారథాన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎస్‌ఓబీ జిల్లా అధ్యక్షుడు శరవణ కుమార్ అధ్యక్షతన కలెక్టర్ నందగోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి మినీ మారథాన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం నిర్వహిం చిన ఈ పోటీలకు సుమారు మూడు వేల మంది విద్యార్థులు కలుసుకున్నారని చెప్పారు. వికలాంగుల కోసం ప్రత్యేక మినీ మారథాన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాల్ దేవసహాయం, పారిశ్రామిక వేత్త విఎం బాలాజీ మొదలియార్, సినీ డెరైక్టర్ గోపాల్ క్రిష్ణన్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement