గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా.. | man dies after falling from train | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా..

Published Mon, Jan 16 2017 2:23 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా.. - Sakshi

గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా..

సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.

అరకు: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన యువకుడు హైటెన్షన్‌ వైర్లు తాకడంతో.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులో సోమవారం జరిగింది. జాన్‌ అనే బీటెక్‌ విద్యార్థి సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి అరకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సెల్ఫీ దిగడానికి యత్నిస్తూ.. తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement