మరో యువకుడితో పబ్కి వెళ్లిందని... | Lover angry on his girlfriend | Sakshi
Sakshi News home page

మరో యువకుడితో పబ్కి వెళ్లిందని...

Mar 24 2016 11:56 AM | Updated on Sep 3 2017 8:29 PM

మరో యువకుడితో పబ్కి వెళ్లిందని...

మరో యువకుడితో పబ్కి వెళ్లిందని...

ప్రియురాలిని కత్తితో గాయపరచిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తిరువొత్తియూరు: ప్రియురాలిని కత్తితో గాయపరచిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పల్లవం తాంగల్ భక్తవశ్చలం నగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ యువకుడు జాన్ (19). ఇతను చెన్నైలోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. ఇలాగే ఫరంగిమలైకు చెందిన సోబియా (18) అదే కళాశాలలో చదువుతోంది. వీరిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సోబియా మరో యువకుడితో పబ్‌కు వెళ్లి నృత్యం చేసినట్టు తెలిసింది.

ఈ సంగతి తెలుసుకున్న జాన్ సోబియా ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. స్నేహితుడు అని అతనితో నృత్యం చేశానని సోబియా తెలిపింది. దీంతో ఆగ్రహం చెందిన జాన్ కత్తితో పొడుస్తానని బెదిరిస్తుండగా దీన్ని అడ్డుకున్న సమయంలో సోబియాకు మెడపై కత్తి తగిలి గాయమైంది. ఇది చూసిన బంధువులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఫరంగిమలై పోలీసు నిలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి జాన్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement