నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై నిలిచిన లారీలు | lorry strike at narketpally-addanki highway | Sakshi
Sakshi News home page

నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై నిలిచిన లారీలు

Apr 3 2017 12:16 PM | Updated on Aug 29 2018 4:18 PM

లారీల సమ్మె ఉధృతమవుతోంది.

నల్గొండ: లారీల సమ్మె ఉధృతమవుతోంది. దీంతో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతుండడంతో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని బలవంతంగా లారీలను తరలించారు. దీంతో లారీ అసోసియేషన్‌ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
వరంగల్‌లో మార్కెట్‌కు సెలవు
లారీల సమ్మె కారణంగా వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ విషయం తెలియక ఎవరైనా రైతులు మార్కెట్‌కు ధానాన్ని తెస్తే వాటిని కొనుగోలు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement