కృష్ణా నదిలో ఆరుగురి గల్లంతు | Krishna River, six missing | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో ఆరుగురి గల్లంతు

Dec 18 2014 3:43 AM | Updated on Sep 2 2017 6:20 PM

కృష్ణా నదిలో  ఆరుగురి గల్లంతు

కృష్ణా నదిలో ఆరుగురి గల్లంతు

శుభకార్యానికి వెళ్లి సొంత గ్రామానికి వస్తున్న సమయంలో తెప్ప బోల్తా పడి ఆరుగురు గల్లంతైన సంఘటన ....

అందరూ ఒకే కుటుంబ సభ్యులు
పెళ్లికి వెళ్లి వస్తుంటే తెప్ప బోల్తా
బాగల్‌కోటే జిల్లా హునగుంద
తాలూకాలో ఘోరం

 
బెంగళూరు: శుభకార్యానికి వెళ్లి సొంత గ్రామానికి వస్తున్న సమయంలో తెప్ప బోల్తా పడి ఆరుగురు గల్లంతైన సంఘటన బాగల్‌కోటే జిల్లా హునగుంద తాలుకాలో జరిగింది. హునగుంద సమీపంలోని ఆమరవాడగి గ్రామంలో బుధవారం వివాహం జరిగింది. ఈ శుభకార్యానికి ఇందవార గ్రామానికి చెందిన మల్లమ్మ (35), హులిగమ్మ (18), కరియప్ప (38), సావిత్రి (6), సచిన్ (5), మంజవ్వ (12)తో సహ బంధువులు వెళ్లారు. శుభకార్యం ముగించుకుని ఈ ఆరుగురితో సహా ఎనిమిది మంది తెప్పలో కృష్ణ నదిపై సొంత గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో నీటి అలలకు తెప్ప బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ సంపవాగి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కృష్ణ్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడ్డా.. ఏ ఒక్కరి ఆచూకీ లభించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement