ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా జయంత్‌ మమ్మెన్‌ మాథ్యూ 

Jayanth Mammen Mathew as INS President - Sakshi

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా సాక్షి డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి 

సాక్షి, బెంగళూరు: 2018–19 సంవత్సరానికి సంబంధించి ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా జయంత్‌ మమ్మెన్‌ మాథ్యూ (మలయాళ మనో రమ) ఎన్నికయ్యారు. శుక్రవారమిక్కడ జరిగిన సొసైటీ 79వ వార్షిక సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శైలేష్‌ గుప్తా (మిడ్‌ డే), వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎల్‌.ఆదిమూలం (హెల్త్‌ అండ్‌ ది యాం టిసెప్టిక్‌), కోశాధికారిగా శరద్‌ సక్సేనా (హిందుస్తాన్‌ టైమ్స్‌), సెక్రటరీ జనరల్‌గా లవ్‌ సక్సేనా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా సాక్షి డైరెక్టర్‌ కె.రాజప్రసాదరెడ్డి ఎన్నికయ్యారు. ఇంకా ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యులుగా ఎస్‌.బాలసుబ్రమణ్యం ఆదిత్యన్‌ (డైలీ తంతి), గిరీష్‌ అగర్వాల్‌ (దైనిక్‌ భాస్కర్‌), సంహిత్‌ బల్‌ (ప్రగతివాది), వి.కె.చోప్రా (దైనిక్‌ అసాం), విజయ్‌ కుమార్‌ చోప్రా (పంజాబీ కేసరి), కరణ్‌ రాజేంద్ర దార్దా (లోక్‌మత్‌), విజయ్‌ జవహర్‌లాల్‌ దార్దా (లోక్‌మత్‌), జగ్జీత్‌సింగ్‌ దార్ది (చర్హదికళ డైలీ), వివేక్‌ గోయెంక (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌), మహేంద్ర మోహన్‌ గుప్తా (దైనిక్‌ జాగరణ్‌), ప్రదీప్‌ గుప్తా (డేటాక్వెస్ట్‌), సంజయ్‌ గుప్తా (దైనిక్‌ జాగరణ్‌), మోహిత్‌ జైన్‌ (ఎకనామిక్‌ టైమ్స్‌), సర్వీందర్‌ కౌర్‌ (అజిత్‌), సీహెచ్‌.కిరణ్‌ (విపుల, అన్నదాత), ఎంవీ శ్రేయమ్స్‌ కుమార్‌ (మాతృభూమి ఆరోగ్య మాసిక), ఆర్‌.లక్ష్మీపతి (దినమలర్‌), విలాస్‌ ఏ మరాఠే (దైనిక్‌ హిందుస్తాన్‌), హర్షా మాథ్యూ (వనిత), నరేష్‌ మోహన్‌ (సండే స్టేట్స్‌మన్‌), అనంత్‌ నాథ్‌ (గ్రిహ్‌శోభిక, మరాఠీ), సుమంత పాల్‌ (అమర్‌ ఉజాల), ప్రతాప్‌ జి పవార్‌ (సకల్‌), డీడీ పుర్కాయస్త (ఆనంద్‌ బజార్‌ పత్రిక), ఆర్‌ఎంఆర్‌ రమేశ్‌ (దినకరణ్‌), అతిదెబ్‌ సర్కార్‌ (ది టెలిగ్రాఫ్‌), రాకేశ్‌ శర్మ (ఆజ్‌ సమాజ్‌), కిరణ్‌ డి.ఠాకూర్‌ (తరుణ్‌ భరత్‌), బిజు వర్ఘీస్‌ (మంగళం వీక్లీ), రాజీవ్‌ వెర్మ (హిందుస్తాన్‌ టైమ్స్‌), వినయ్‌ వెర్మ (ది ట్రైబ్యూన్‌), బాహుబలి ఎస్‌ షా (గుజరాత్‌ సమాచార్‌), హోర్ముస్‌జీ ఎన్‌ కామా (బాంబే సమాచార్‌ వీక్లీ), కుందన్‌ ఆర్‌ వ్యాస్‌ (వ్యాపార్‌), కె.ఎన్‌.తిలక్‌ కుమార్‌ (డెక్కన్‌ హెరాల్డ్‌ అండ్‌ ప్రజావాణి), రవీంద్రకుమార్‌ (ది స్టేట్స్‌మన్‌), కిరణ్‌ బి వడోదారియా (సంభవ్‌ మెట్రో), పి.వి.చంద్రన్‌ (గృహలక్ష్మి), సోమేశ్‌ శర్మ (రాష్ట్రదూత్‌ సప్తాహిక్‌), అకిల ఉరంకార్‌ (బిజినెస్‌ స్టాండర్డ్‌) ఉన్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top