చెరకు రైతుకు ‘కొత్త’ కానుక | Jayalalithaa governemnt. hikes sugarcane procurement price by Rs 550 per tonne | Sakshi
Sakshi News home page

చెరకు రైతుకు ‘కొత్త’ కానుక

Dec 22 2013 2:20 AM | Updated on Sep 2 2017 1:50 AM

చెరకు రైతుకు ‘కొత్త’ కానుక

చెరకు రైతుకు ‘కొత్త’ కానుక

రాష్ర్ట అన్నదాతలకు కొత్త సంవత్సర కానుకగా చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2650గా నిర్ణయించారు. కేంద్రం రూ.2100 ప్రకటించగా, రవాణా ఖర్చు,

రాష్ర్ట అన్నదాతలకు కొత్త సంవత్సర కానుకగా చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2650గా నిర్ణయించారు. కేంద్రం రూ.2100 ప్రకటించగా, రవాణా ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.550ను అదనంగా చేర్చారు. శ్రీలంక, భారత నావికాదళం సంయుక్తంగా చేపట్టనున్న ఉమ్మడి శిక్షణను ఖండిస్తూ సీఎం జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని చెరకు రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. టన్ను చెరకుకు 2,650 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం మంత్రి మండలి సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, విభాగాల వారీగా ప్రగతి, నిధుల కేటాయింపులు, కలెక్టర్ల మహానాడులో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తులు, రాష్ర్టంలో సాగవుతున్న పంటల ఉత్పత్తి తది తర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చెరకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టన్నుకు రూ. 2650 : రాష్ర్టంలో 8.65 లక్షల ఎకరాల్లో చెరకు సాగువుతోంది. చెరకు రైతులకు ప్రతి ఏటా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తోందని సీఎం జయలలిత గుర్తుచేశారు. 
 
 పభుత్వం కల్పిస్తున్న రాయితీలు, రుణాల పంపిణీ గురిం చి విశదీకరించారు. చక్కెర ఉత్పత్తి పెంపు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం చెరకు మద్దతు ధర ప్రకటించినప్పుడల్లా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కొంత మొత్తాన్ని చేరుస్తూ, అన్నదాతకు అందజేస్తోందని గుర్తు చేశారు. ఈ ఏడాది టన్నుకు రూ.2100 కేంద్రం నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా రూ.550ను రాష్ట్ర ప్రభు త్వ వాటాగా పెంచామన్నారు. టన్ను మద్దతు ధర రూ.2650గా నిర్ణయించామన్నారు. 2013-14 సం వత్సరానికి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించినా, రాష్ర్ట వాటాలో చడీచప్పుడు కాకుండా రూ.వంద కోత పెట్టడం గమనార్హం. 
 
 శిక్షణ వద్దు: శ్రీలంక, భారత నావికాదళం సంయుక్తంగా చేపట్టనున్న ఉమ్మడి శిక్షణను రద్దు చేయాలని కేంద్రాన్ని సీఎం జయలలిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆమె లేఖాస్త్రం సంధించారు. ఈలం తమిళుల సంక్షేమం విషయంలో, తమిళ జాలర్లపై దాడుల వ్యవహారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక ఆర్మీ సేనకు ఇక్కడ శిక్షణ ఇప్పించేం దుకు జరిగిన ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు రాజుకున్న విషయం  గుర్తు చేశారు. ప్రస్తుతం త్రికోణ మలై వేదికగా సంయుక్త శిక్షణకు నిర్ణయించినట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు.  ఈ శిక్షణ ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత నావికాదళాన్ని వెనక్కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని, తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా తరచూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రక్షణ శాఖ తీరుకు కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement