ఇసైకి ముహూర్తం కుదిరింది | 'Isai release date announced' Tamil Movie | Sakshi
Sakshi News home page

ఇసైకి ముహూర్తం కుదిరింది

Jan 26 2015 4:28 AM | Updated on Sep 2 2017 8:15 PM

ఇసైకి ముహూర్తం కుదిరింది

ఇసైకి ముహూర్తం కుదిరింది

ఇసై చిత్రానికి ముహుర్తం కుదిరింది. దర్శక నటుడు ఎస్‌జె సూర్య హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇసై.

 ఇసై చిత్రానికి ముహుర్తం కుదిరింది. దర్శక నటుడు ఎస్‌జె సూర్య హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇసై. ఇది ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ మధ్య ఇగో ఇత్యాది అంశంతో కూడిన కథా చిత్రమంటూ ప్రచారం జరిగి కలకలం పుట్టించిన చిత్రం. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ప్రకాష్‌రాజ్ నిరాకరించి చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం.
 
 మొత్తం మీద చాలా కాలంగా నిర్మాణంలో వున్న ఇసై చిత్రానికి ఇప్పటికీ మోక్షం వచ్చింది. ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇసై చిత్రం ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందంటున్నారు. చిత్ర దర్శక హీరో ఎస్‌జె సూర్య, ప్రకాష్‌రాజ్ తిరస్కరించిన పాత్రను సత్యరాజ్ పోషించడం విశేషం. కథా నటి సావిత్రి నాయకిగా పరిచ యం అవుతున్న ఈ చిత్రానికి ఎస్‌జె సూర్య నే సంగీత బాధ్యతలు చేపట్టడం మరో విశేషం. ఇసై చిత్రాన్ని ఈ నెల 30న 300థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement