ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ | IAS Trainee Robbed Of His Mobile | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ

Feb 11 2015 5:23 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ - Sakshi

ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ

ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ చేసి రూ. 10 వేలకు విక్రయించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తిరువొత్తియూరు: ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ చేసి రూ. 10 వేలకు విక్రయించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఐఏఎస్ అధికారి. ఇతను శిక్షణకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైకి వచ్చారు. చేపాక్కం గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. గత 2వ తేదీ రాత్రి 10.30 గంటలకు మద్రాసు యూనివర్సిటీ వద్ద వాలాజా రోడ్డులో వాకింగ్ చేస్తున్న సమయంలో బైకులో వచ్చిన ఓ వ్యక్తి ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు.

నేరస్తున్ని పట్టుకుని అరెస్టు చేయూలని పోలీసులకు కమిషనర్ జార్జి ఆదేశాలు జారీ చేశారు. సహాయ కమిషనర్ పీర్ మహ్మద్ నేతృత్వంలో అన్నా సమాధి పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శివానందం కేసు నమోదు చేసి విచారణ చేపట్టా రు. పోలీసుల విచారణలో ప్రశాంత్‌కుమార్ మిశ్రా సెల్‌ఫోన్‌ను దుండగుడు రూ . 10వేలకు బర్మాబజార్‌లో విక్రయించినట్టు తెలిసింది. దీంతో ఈ సెల్‌ఫోన్‌ను విక్రయిం చిన ప్యారిస్‌కు చెందిన పీర్ హనీఫ్ (21) అనే యువకుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement