తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని ప్రముఖ నటుడు రజినీకాంత్ చెప్పారు.
చెన్నై: ‘నేను కర్ణాటక నుంచి వచ్చినా మీ అభిమానంతో నన్ను పూర్తిగా తమిళుయుడిని చేశారు. నాకు గొప్పగా స్వాగతం పలికారు’అని ప్రముఖ దక్షిణాది నటుడు రజినీకాంత్ అన్నారు. ఆయన రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానులతో చివరి రోజు భేటీ ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైలోని కొడాంబక్కంలో తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా రజినీకాంత్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన ఏమన్నరంటే..
‘నేను కర్ణాటకలో 23సంవత్సరాలు జీవించాను. అలాగే తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నాను. నేను కర్ణాటక నుంచి నాకు ఘనస్వాగతం పలికారు.. నన్నొక నిజమైన తమిళుడిగా మార్చారు. నేను ఇప్పుడు పక్కా తమిళుయుడిని. రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది’ అని ఆయన చెప్పారు. తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని, అలా వెళ్లిపోయే ప్రసక్తి లేదని రజినీకాంత్ చెప్పారు.
తాను పక్కా తమిళుడినే అన్న ఆయన తాను ఏం మాట్లాడినా మీడియా తనను తరుముతోందని, సంచలనం చేస్తోందని, ఇందుకు రాజకీయాలే కారణం అని అన్నారు. తాను ఎంతో క్రమ శిక్షణతో ఉండటం వల్లే ఇలా ఉన్నానని చెప్పిన రజినీ ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చినప్పుడు తన గొంతు వినిపిస్తానని చెప్పారు. ‘ మీతోపాటే నాక్కూడా బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఇప్పుడవి చేద్దాం. కానీ, తప్పనిసరి పోరాటం వచ్చినప్పుడు మనందరం చూస్తాం’ అని ఆయన అన్నారు. సరైన సమయంం వచ్చినప్పుడు అభిమానం చూపించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
‘రాజకీయాల్లో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ, వ్యవస్థ చెత్తగా మారినప్పుడు మనమేం చేస్తున్నాం. ప్రజాస్వామ్యం భ్రష్టుపడిపోయింది. వ్యవస్ధ మారాలి. ప్రజల ఆలోచనల్లోంచి మార్పు రావాలి. అప్పుడే దేశం సరైన మార్గంలో ముందు కెళుతోంది’ అని రజినీ చెప్పారు.