నేనూ సాధారణ స్త్రీనే | i am common woman says nayantara | Sakshi
Sakshi News home page

నేనూ సాధారణ స్త్రీనే

May 6 2015 1:55 AM | Updated on Sep 3 2017 1:29 AM

నేనూ సాధారణ స్త్రీనే

నేనూ సాధారణ స్త్రీనే

నేను సాధారణ స్త్రీనే అని అంటున్నారు సంచలన తార నయనతార. అయితే చాలామంది నటీమణులు వ్యక్తిగత జీవితాలకు

నేను సాధారణ స్త్రీనే అని అంటున్నారు సంచలన తార నయనతార. అయితే చాలామంది నటీమణులు వ్యక్తిగత జీవితాలకు భిన్నం ఈమె జీవితం అని చెప్పవచ్చు. కారణం నయన నిజ జీవితం తెరచిన పుస్తకం. అందులో చాలా పుటలు, పలువురికి సుపరిచయమే. తొలుత మాతృభాష మలయాళంలో రెండు చిత్రాలు చేశారు. ఆ తరువాత అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమెకిక్కడ తొలి చిత్రంతోనే విజయాహ్వానం లభించింది.  ఆ తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చంద్రముఖి, శింబుకు జంటగా నటించిన వల్లవన్ చిత్రాలు నయన్ స్థాయిని పెంచాయనే చెప్పాలి.
 
   నటుడు శింబుతో ప్రేమాయణం ఆమెను సంచలన నటిని చేసింది. శింబుతో ప్రేమ మనస్పర్థల కారణంగా బద్దలైంది. ఆ  సంఘటనలు నయన్‌ను కోలీవుడ్‌లో నిలువ నీయకుండా చేశాయి. అదే సమయంలో టాలీవుడ్ తలుపులు తెరిచింది. అక్కడ లక్ష్మీ తదితర చిత్రాలు విజయాలు గత చేదు అనుభవాలను మరిచేలా చేశాయి. అయితే  నృత్య దర్శకుడు ప్రభుదేవాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు దారి తీసింది.
 
 అనూహ్యంగా ఆ ప్రేమ ఫెయిల్ అయ్యింది. సుమారు రెండేళ్ల పాటు నటనకు దూరం అయిన నయనతార మళ్లీ నటనపై దృష్టి సారించడం, ఆమెను మరోసారి తమిళ పరిశ్రమ ఆదరించడం అనేది బహుశా ఆమె కూడా ఆశించి ఉండదు. ప్రస్తుతం ప్రముఖ కథానాయికగా ప్రకాశిస్తున్న నయన ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె గత ప్రేమలు, అవి విఫలమైన విషయాల గురించి ప్రశ్నలు విలేకరుల నుంచి ఎదురయ్యాయి. వాటికి నయనతార బదులిస్తూ నేను సాధారణ అమ్మాయినే.
 

Advertisement
 
Advertisement
Advertisement