11 నిమిషాల్లో ముంబై నుంచి పుణేకు! | Hyperloop mission: mumbai to Pune in Just 11Minutes | Sakshi
Sakshi News home page

11 నిమిషాల్లో ముంబై నుంచి పుణేకు!

Apr 27 2017 5:28 PM | Updated on Sep 5 2017 9:50 AM

11 నిమిషాల్లో ముంబై నుంచి పుణేకు!

11 నిమిషాల్లో ముంబై నుంచి పుణేకు!

ముంబై నుంచి పుణేకు కేవలం 11 నిమిషాల్లో చేరుకోగలమా అంటే అవునని టక్కున చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయి.

  •     హైపర్‌ లూప్‌ రైలును ప్రవేశపెట్టేందుకు పీఎంఆర్డీఏ సన్నాహాలు
  •     ఇప్పటికే హైపర్‌లూప్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ప్రధాని మోదీ
  •     త్వరలో ప్రారంభం కానున్న పనులు..

  • ముంబై: ముంబై నుంచి పుణేకు కేవలం 11 నిమిషాల్లో చేరుకోగలమా అంటే అవునని టక్కున చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా పరుగులు తీసే రవాణా వ్యవస్థగా పేరుగాంచిన ‘హైపర్‌ లూప్‌’ రైలును ముంబై–పుణే మధ్య ప్రవేశపెట్టేందుకు ‘పుణే మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ (పీఎంఆర్డీఏ) సన్నాహాలు చేస్తోంది. మాములుగా ముంబై నుంచి పుణేకు రోడ్డు మార్గం మీదుగా వెళితే కనీసం మూడు గంటల సమయం పడుతుంది.

    విమానంలో వెళితే 20 నిమిషాల సమయం పడుతుంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ‘హైపర్‌ లూప్‌ ట్రాన్స్‌మేషన్‌ టెక్నాలాజీ’ అనే కంపెనీకి చెందిన నిపుణుల బృందం పీఎంఆర్డీఏ పరిధిలో పర్యటించింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పేందుకు ప్రాథమికంగా సంసిద్ధత వ్యక్తం చేసింది.

    దేశంలోనే మొదటిసారిగా..
    అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో దేశంలోనే మొదటిసారిగా ముంబై నుంచి పుణే మధ్య హైపర్‌ లూప్‌ రైలు పట్టాలెక్కనుంది. దుబాయ్‌లోని అబుదాబీ, రష్యాలోని మాస్కో, చైనా ఇలా మూడు దేశాల్లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కంపెనీలు హైపర్‌ లూప్‌ పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని మోదీ దేశంలో ఏర్పాటు చేసేందుకు సాధ్యమవుతుందా?

    ఒకవేళ సాధ్యమైతే ఏ ఏ నగరాల మధ్య దీన్ని చేపట్టవచ్చనే దానిపై కంపెనీ అధ్యక్షుడు బీబాప్‌ గెస్ట్రాతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ భేటీ అయి చర్చించారు. ఇందులో ముంబై–పుణే నగరాల మ«ధ్య ఈ హైపర్‌ లూప్‌ను ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఉందని గడ్కారీ అభిప్రాయడ్డారు. దీంతో కంపెనీ బృందం పీఎంఆర్డీయే పరిధిలో పర్యటించింది.

    హైపర్‌ లూప్‌ అంటే ఏమిటి?
    స్పేస్‌ఎక్స్‌ కంపెనీ సంస్థాపకుడు, ప్రముఖ పెట్టుబడిదారుడు ఇలాన్‌ మాస్క్‌ ఈ హైపర్‌ లూప్‌ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని 2013లో ప్రపంచానికి పరిచయం చేశారు. గంటకు 1,220 కి.మీ. వేగంతో పరుగులు తీసే ఈ రైలు లూప్‌లో ప్రయాణికులు కూర్చుంటారు. దీని మార్గం క్యాప్సూల్‌ లేదా ట్యూబ్‌ లేదా సొరంగం లాగా ఉంటుంది. అందులోంచి రైలు దూసుకెళ్తుంది. క్యాప్సుల్‌ పొడవు 30 మీటర్లు, వెడల్పు 2.7 మీటర్లు, బరువు సుమారు 20 టన్నుల వరకు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement