ఎంపీ కేశినేనికి హైకోర్టు నోటీసులు | high court notices to mp kesineni nani | Sakshi
Sakshi News home page

ఎంపీ కేశినేనికి హైకోర్టు నోటీసులు

Apr 25 2017 1:25 PM | Updated on Aug 31 2018 8:57 PM

ఎంపీ కేశినేనికి హైకోర్టు నోటీసులు - Sakshi

ఎంపీ కేశినేనికి హైకోర్టు నోటీసులు

విజయవాడ ఆర్‌టీఏ కమిషనర్‌పై దాడి ఘటనలో టీడీపీ ఎంపీ,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

హైదరాబాద్‌: విజయవాడ రోడ్డు రవాణా సంస‍్థ (ఆర్‌టీఏ) కమిషనర్‌పై దాడి ఘటనలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు కేసును సూమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపింది.
 
ప్రతివాదులు 11 మందికి నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ  ఎమ్మెల్యే  బోండా ఉమ మహేశ్వర్ రావు, మేయర్ కోనేరు శ్రీధర్‌,  ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్‌ మీరా, ఆంధ్రప్రదేశ్  హోం శాఖ, ట్రాన్స్ పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, ఏపీ డీజీపీ ,విజయవాడ సీపీలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement