నారాయణ్ సాయి ఆశ్రమంపై పోలీసుల దాడులు | Gujarat police raid Asaram's Bihar ashram, no trace of Narayan Sai | Sakshi
Sakshi News home page

నారాయణ్ సాయి ఆశ్రమంపై పోలీసుల దాడులు

Oct 27 2013 12:20 AM | Updated on Aug 21 2018 2:29 PM

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసారామ్ బాపూజీ కుమారుడు నారాయణ్ సాయికు చెందిన విరార్‌లోని ఆశ్రమంపై శుక్రవారం రాత్రి గుజరాత్ పోలీసులు దాడులు చేశారు.

సాక్షి ముంబై: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసారామ్ బాపూజీ కుమారుడు నారాయణ్ సాయికు చెందిన విరార్‌లోని ఆశ్రమంపై శుక్రవారం రాత్రి గుజరాత్ పోలీసులు దాడులు చేశారు. పరారీలో ఉన్న నారాయణ్ సాయి ఆచూకీ దొరక్కపోవడంతో ఏమైనా వివరాలు తెలుస్తాయా అనే కోణంలో ఈ ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు.

విరార్‌లోని కుంభార్ పాడా గ్రామంలో ఆశ్రమం నిర్వహిస్తున్న నారాయణ్ సాయి తరచూ ఇక్కడకు వస్తుంటాడని గుజరాత్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు విరార్ పోలీసుల సహాయంతో ఆశ్రమంపై చర్యలు చేపట్టారు. కానీ ఆశ్రమంలో కార్మికులు తప్పా ఇంకెవ్వరు దొరకలేదు. సూరత్ పట్టణంలో ఇద్దరు ఇక్కాచెల్లెళ్లు ఆసారామ్ బాపు, నారాయణ్ సాయిపై జహాంగీర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement