యువతిపై బలాత్కారం కేసులో అరెస్ట్
తిరువొత్తియూరు: విద్యార్థినిపై బలాత్కారం చేసిన కేసులో వివాహమైన కొద్ది గంటలకే వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుమరి జిల్లా తక్కలై ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి నాగర్‌కోవిల్‌లోని కళాశాలలో చదువుతోంది. ఈమెతో పరిచయం ఏర్పరచుకున్న కులిందురై ప్రాంతానికి చెందిన సురేష్ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. ఇతని మిత్రులు కోవిల్‌కు చెందిన గోపాల్ (47), అరుగువిలైకు చెందిన దినేష్ (25), వాత్తియార్‌విలైకు చెందిన జ్ఞాన ప్రభు సైతం బలాత్కారానికి పాల్పడ్డారు.
విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడచేరి పోలీసులు విచారణ జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జ్ఞానప్రభు మదురై హైకోర్టు శాఖలో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశాడు. అందులో నవంబర్ 4న తన వివాహం జరిగే వరకు అరెస్టు నిలుపుదల చేయాలని పిటీషన్‌లో కోరాడు. పిటీషన్ పరిశీలించిన న్యాయమూర్తులు వివాహం జరిగే వరకు అరెస్ట్ చేయరాదని పోలీసులను ఆదేశించారు. దీంతో వివాహం జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు అతన్ని నాగర్‌కోవిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో మండపంలోని వారు అవాక్కయ్యారు. జ్ఞానప్రభును శనివారం కోర్టులో హాజరుపరిచారు.
పెళ్లి రోజునే చేతికి సంకెళ్లు
Published Sun, Nov 6 2016 2:13 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement